Drugs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం, గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగం రాష్ట్రంలో పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గంజాయి, డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Read Also: Kejriwal : 10 రోజుపాటు ‘విపశ్యన’ ధ్యానంలో కేజ్రీవాల్
ఈ ప్రతిపాదనలను త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ చర్యల ద్వారా గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగం గురించి ఆలోచించేందుకు భయపడతారని, ఆ రకమైన భయాన్ని కలిగిస్తే వీటిని కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా ఇందుకోసం ఈగల్స్ పేరిట వ్యవస్థను ఏర్పాటు చేసింది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును అడ్డుకోవడానికి డ్రోన్లను సైతం ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా గంజాయి సాగును గుర్తించి, పంటను అక్కడికక్కడే ధ్వంసం చేస్తున్నారు.
ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో గంజాయి సాగును వంద ఎకరాల్లోపు పరిమితం చేసినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత కూడా బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించారు. గంజాయి సాగు, రవాణాకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. మంత్రుల అభిప్రాయాలను తెలుసుకుని ఆ తర్వాత ఓ తుది నిర్ణయానికి రానున్నారు. ఈ చర్యల ద్వారా గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగం గురించి ఆలోచించేందుకు భయపడతారని, ఆ రకమైన భయాన్ని కలిగిస్తే వీటిని కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి చర్యల ద్వారా గంజాయి సాగు, రవాణా గురించి ఆలోచించేందుకు భయపడతారని, ఆ రకమైన భయాన్ని కలిగిస్తే వీటిని కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.