Site icon HashtagU Telugu

Free Bus Travel : ఉచిత బ‌స్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Free Bus Travel

Free Bus Travel

Free Bus Travel : ఏపీ ప్రభుత్వం మ‌హిళల ఉచిత బ‌స్సు ప్రయాణంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు (శనివారం) ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మంత్రి వ‌ర్గ ఉప‌సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియ‌మించింది. రవాణా శాఖ మంత్రి మండిప‌ల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం నియమకం అయింది. హోం మంత్రి అనిత‌, గిరిజ‌న‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స‌భ్యులుగా సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు, విధివిధానాలు, ఏపీలో ఎలా అమలు చేయాలి, ఇప్పటికే అమలవుతున్న రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్నారు. అలాగే మంత్రుల కమిటీ వీలైనంత త్వరగా తమ నివేదికల్ని, సూచనల్ని ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. రవాణా శాఖ ముఖ్య కార్యద‌ర్శి క‌న్విన‌ర్‌గా ఈ ఉప సంఘం ఉండనుంది.

కాగా, సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈరోజు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. తాజాగా ఈ పథకం అమలుపై మంత్రి మండిప‌ల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి నుంచే ఫ్రీ జర్నీ అమలు చేస్తామని, దీనికోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఈక్రమంలోనే ఆరు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను ఇవాళ(శనివారం) మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ప్రారంభించారు. ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు నగదు పారితోషకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ మాట్లాడుత౦ఊ..ఆర్టీసీ డిపో నూతన భవనాలు శ్రీకారం చుట్టామని అన్నారు. జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ మైదానం ఏర్పాటు చేస్తామని రవాణాశాఖ మంత్రి మండిప‌ల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.

గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆర్టీసీ పట్టించుకోలేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పిన ఆర్టీసీని సరైన మార్గంలో నడిపిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆర్టీసీకి సంబంధించి సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సుల్ని త్వరలోనే ప్రవేశపెడతామన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు అనేక సౌకర్యాలు ఉండేవని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం మాత్రం అన్నింటిని నిలిపివేసిందన్నారు.

Read Also: Liquor Rates : ఏపీలో మద్యం రేట్లను తగ్గించిన 11 కంపెనీలు