Site icon HashtagU Telugu

Amaravathi : అమరావతికి మరో తీపి కబురు

Amaravati

Amaravati

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravathi ) అభివృద్ధికి మరో ముఖ్యమైన ఆర్థిక మద్దతు లభించింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) అమరావతి నిర్మాణం కోసం రూ.11,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ ఒప్పందానికి సంబంధించి హడ్కో-సీఆర్‌డీఏ అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సంతకాలు చేశారు. హడ్కో బోర్డు జనవరి 22న ముంబయిలో జరిగిన సమావేశంలో ఈ రుణాన్ని ఆమోదించింది. అయితే తాజాగా అధికారిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో త్వరలోనే ఈ నిధులు విడుదల కానున్నాయి. ఈ రుణంతో రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.

Black Magic Vs 1500 Crores: పుర్రెలు.. లీలావతి ఆస్పత్రి.. రూ.1500 కోట్ల స్కామ్

అమరావతి అభివృద్ధికి ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా రుణం ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు హడ్కో రుణం రావడంతో నిర్మాణానికి మరింత ఊతం లభించనుంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభించాలని అధికారులు యోచన చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అమరావతిని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా మార్చి నెలాఖరులోగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి మరోసారి రీలాంచ్ చేసే అవకాశం ఉంది.

Revanth Reddy : నువ్వు మనిషివా పశువువా? – హరీశ్ రావు

ఇక అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విగ్రహం ఆయన 58 రోజుల దీక్షకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా, పొట్టి శ్రీరాములు స్మారక పార్కు, ఆయన సొంతూరు నెల్లూరులో మ్యూజియం, ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, ఏపీ ప్రభుత్వం 12 నెలలు 12 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఉగాది నుండి ‘పీ-4’ విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా అమరావతికి ప్రాధాన్యత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.