వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అధికార అండచూసుకొని రెచ్చిపోయిన నేతలు…ఇప్పుడు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు జైలు పాలవ్వగా..పరువురు బెయిల్ పై తిరుగుతున్నారు. తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి కి మరో షాక్ తగిలింది.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచితంగా, పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ చైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా రాజకీయ విమర్శలు సహజమే అయినప్పటికీ, పరుష పదజాలం వాడడం, వ్యక్తిగత దూషణలకు దిగడం చట్టపరమైన చిక్కులకు దారి తీస్తుందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఎన్నికల్లో వైఫల్యం తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ కొత్త కేసు కాకానిపై మరింత రాజకీయ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.
Nara Lokesh : ‘నా తల్లిని’ అవమానిస్తే నేను వదిలిపెడతానా? – లోకేష్ మరోసారి వార్నింగ్
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి సంబంధించిన పాత నకిలీ మద్యం కేసు మళ్లీ తెరపైకి రావడం, అందులో కీలకమైన ఫైళ్లు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, వాటికి లేబుళ్లు వేసి ఓటర్లకు పంపిణీ చేశారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. ఈ కల్తీ మద్యం సేవించి పలువురు మరణించగా, వందలాది మంది తీవ్ర అనారోగ్యం పాలైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కేసులో కొన్ని కీలక ఫైళ్లు 2018లోనే మిస్ అయినట్లు విజయవాడలోని ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఆ తర్వాత కోర్టు ఈ కేసును సీఐడీకి అప్పగించినప్పటికీ, 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం వల్ల దర్యాప్తు ఆగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ మంత్రులు, వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై పాత కేసుల దర్యాప్తు వేగవంతం కావడం, కొత్త కేసులు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరి వీటిని వైసీపీ నేతలు ఎలా ఎదురుకుంటారో చూడాలి.
