Senior Citizen Card : సీనియర్ సిటిజన్‌లకు గొప్ప అవకాశం. వారంతా సీనియర్ సిటిజన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను సమర్పిస్తే వారంలో కార్డు అందుతుంది. మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాల ద్వారానూ అప్లై చేయొచ్చు. జిల్లా కేంద్రాల్లోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయంలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసిన రోజే కార్డును ఇస్తారు. డిజిటల్ కార్డు దరఖాస్తుకు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, బ్లడ్ గ్రూప్, ఆధార్ కార్డు హిస్టరీ, ఇతర ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఏపీలో 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలు దీనికి అర్హులు. ఈ ఒక్క కార్డు ఉంటే గుర్తింపు పత్రాలన్నీ చూపించకుండానే దేశవ్యాప్తంగా ఎక్కడైనా అనేక ప్రభుత్వ ప్రయోజనాలను పొందొచ్చు. ఇంతకీ ఈ కార్డులు ఎందుకు ? సీనియర్ సిటిజన్‌లకు లాభాలేంటి ? తెలుసుకుందాం..
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 26 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
ప్రయోజనాలివీ..
- సీనియర్ సిటిజన్ కార్డు(Senior Citizen Card) ఉంటే.. ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు ప్రతిసారీ వయసు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం ఉండదు.
- సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా అధికారికంగా వయసు ధ్రువీకరణ జరుగుతుంది.
- ప్రతిసారీ ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపించాల్సిన పని ఉండదు.
- ఈ కార్డును చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ ఇస్తారు.
- ఈ కార్డును చూపించి అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో చేరే వీలు ఉంటుంది.
- దూర ప్రాంతాల బస్సులు మినహా ఇతర ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రెండు సీట్లను రిజర్వ్ చేస్తారు.
- రైల్వే స్టేషన్లలో వృద్ధులకు ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఉంటాయి.
- అవసరమైన వృద్ధులకు వీల్‌ఛైర్ సదుపాయాన్ని కల్పిస్తారు.
- 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లకుపైగా వయసు కలిగి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్ కేటాయింపులో రైల్వేశాఖ ప్రాధాన్యత ఇస్తుంది.
- ఈ కార్డు ఉంటే కోర్టుల్లో కేసుల విచారణలో ప్రాధాన్యత లభిస్తుంది.
- పాస్‌పోర్ట్ సేవా ఫీజుల్లో 10 శాతం రాయితీ ఇస్తారు.
- ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.5 శాతం అదనపు వడ్డీ ఇస్తారు.
- 80 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజెన్లకు ఎఫ్‌డీలపై 1 శాతం అదనపు వడ్డీ ఇస్తారు.
- 60 ఏళ్లకుపైగా వయసు కలిగిన వారికి రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లకుపైగా వయసు కలిగిన వారికి రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తారు.
- హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకుంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఇస్తారు.