Microsoft-AP Govt : మైక్రోసాఫ్ట్ సంస్థతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం

Microsoft-AP Govt : ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ అవకాశాలను ఏపీ యువత సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది

Published By: HashtagU Telugu Desk
Microsoft Ap Govt Mou

Microsoft Ap Govt Mou

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) రాష్ట్ర యువతకు భవిష్యత్‌కు మార్గదర్శకంగా నిలిచే అద్భుత అవకాశాన్ని అందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి ఆధునాతన సాంకేతిక రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, ఏడాది వ్యవధిలో 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ అవకాశాలను ఏపీ యువత సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది.

Good News : ఏపీలో పింఛన్‌లు తీసుకునేవారికి అదిరిపోయే న్యూస్

ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం యువతలో ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పెంచి, ఐటీ రంగంలో ఎక్కువ మంది ఉపాధి పొందేలా చేయడం. ఇందులో భాగంగా, రాష్ట్రంలోని 50 ఇంజినీరింగ్ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే, 10,000 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 30 ఐటీఐలలో 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీపై శిక్షణ అందించనున్నారు. దీని ద్వారా, యువతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాలు పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

Nagam Janardhan Reddy : చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ వెనుక అసలు కారణం..?

అంతేకాదు, ఈ ప్రాజెక్టు కింద యునిసెఫ్ భాగస్వామ్యంతో 40,000 మంది యువతకు, కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ సహకారంతో మరో 20,000 మందికి కృత్తిమ మేధా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. విద్యా సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలను ప్రవేశపెట్టేందుకు మైక్రోసాఫ్ట్ అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్ అందించనుంది. దీని వల్ల రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ చేయగల సామర్థ్యం పొందుతారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం రాష్ట్ర యువత భవిష్యత్తుకు వెలకట్టలేని అవకాశంగా మారనుంది.

  Last Updated: 13 Mar 2025, 08:52 PM IST