Governor Abdul Nazeer : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఏపీ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చి చారిత్రాత్మక విజయాన్ని అందజేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యత. ప్రతి సవాల్‌ను అవకాశంగా మార్చుకుని ముందుకు వెళ్తున్నాం” అని పేర్కొన్నారు.
Mass Jathara : రవితేజ మాస్ జాతర గ్లింప్స్ వచ్చేసింది.. మనదే ఇదంతా..
గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలను ప్రస్తావించారు. “ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి కోసం పది సూత్రాల ప్రణాళిక రచించి ముందుకు సాగుతున్నాం. ప్రతీ గ్రామం, ప్రతీ వర్గం అభివృద్ధి చెందాలి. పేదరికం లేని సమాజం మా లక్ష్యం. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అందరికీ తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ (పీపీపీ) మోడల్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిన రంగాలు” అని వివరించారు.
పోలవరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ, “పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల జీవనాడి. 2026 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఇది పూర్తయితే రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలు పూర్తిగా తీరతాయి. అంతేకాకుండా, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గేమ్‌చేంజర్‌గా నిలుస్తాయి” అని తెలిపారు.
“రాష్ట్రం అభివృద్ధిలో ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తోంది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఐఓటి (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), డ్రోన్స్, రోబోటిక్స్, సాటిలైట్ టెక్నాలజీ సహాయంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ లక్ష్యం. ఈ టెక్నాలజీలు భవిష్యత్తులో రాష్ట్రానికి కొత్త అవకాశాలను తెస్తాయి” అని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి సహకారం అందుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఉక్కు పరిశ్రమల స్థాపనకు కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. “స్వర్ణాంధ్ర 2047” అనే లక్ష్యంతో రోడ్‌మ్యాప్ రూపొందిస్తున్నామని, “ఆరోగ్యం-ఐశ్వర్యం-ఆనందం” అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు.
Litchi Fruit: లిచీ పండ్ల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం!