Dogs Care Centers : మన దేశంలో ఏటా అత్యధికంగా కుక్కకాటు కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2022 సంవత్సరంలో మహారాష్ట్రలో సగటున 3,46,318 కుక్కకాటు కేసులు నమోదవగా, తమిళనాడులో 3,30,264 కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1,69,378 కుక్క కాటు కేసులతో ఆ ఏడాదిలో దేశంలోనే మూడో స్థానంలో నిలవడం ఆందోళన రేకెత్తించే అంశం. ప్రత్యేకించి ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ఇక ఈ ఏడాది విషయానికి వస్తే.. గత తొమ్మిది నెలల వ్యవధిలో ఏపీలోని ఒక్కో జిల్లాలో సగటున 6వేల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అందుకే ఇప్పుడు వీధి కుక్కల నియంత్రణపై టీడీపీ సర్కారు ఫోకస్ పెట్టింది.
Also Read :Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు.. ఆర్జీవీ ఫోన్ స్విచ్ఛాఫ్ ?
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో దాదాపు 4,33,751 వీధి కుక్కలు(Dogs Care Centers) ఉన్నాయి. 2025 సంవత్సరం మార్చిలోగా రాష్ట్రంలోని పట్టణాల్లో 2,01,213 వీధి కుక్కలకు గర్భనిరోధక శస్త్ర చికిత్సలు చేసి, వ్యాక్సినేషన్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఒక కుక్కల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతపురం జిల్లాలో మూతపడిన కుక్కల సంరక్షణ కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని అనుకుంటోంది. కుక్క కాట్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో వీధి కుక్కలను పట్టుకొని ప్రత్యేక వసతి గృహాల్లో సంరక్షించాలని సర్కారు యోచిస్తోంది.
Also Read :Telangana Airports : తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్టులు.. వచ్చే ఏడాది ‘మామునూరు’ రెడీ
కుక్కలు ఎందుకు కరుస్తున్నాయ్ ?
కుక్కలు మనిషికి చాలా సన్నిహితంగా ఉంటాయి. సెక్యూరిటీని కూడా ఇవి అందిస్తాయి. పెంపుడు జంతువుల్లో టాప్ క్లాస్ అంటే కుక్కలే. ఇంతకీ కొన్ని వీధి కుక్కలు ఎందుకు దాడులు చేస్తుంటాయి? టూ వీలర్స్‌పై వెళ్లే వాళ్లను ఎందుకు తరుముతాయి ? కొన్ని కుక్కల ప్రవర్తనలో ఈ మార్పులు ఎందుకు వస్తాయి ? అనే అంశాలపై పెటా ఇండియా సంస్థ పలువురు నిపుణులతో కలిసి అధ్యయనం నిర్వహించింది. ఇందులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. మనుషుల ప్రవర్తనలో వస్తున్న మార్పులతోనే కుక్కల్లో క్రూరత్వం పెరుగుతోందని తేలింది. కుక్కలకు బయట తిండి దొరకడం లేదు. మనుషుల నుంచి ఆదరణ కరువైంది. కుక్కలు కనిపిస్తే తరిమికొట్టడం లాంటి చర్యలు ఎక్కువయ్యాయి. దీంతో కుక్కలు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నాయి. కరోనా టైంలో కుక్కలకు స్టెరిలైజేషన్ చేసే ప్రక్రియను నిలిపివేశారు. దీంతో వాటి సంతానం బాగా పెరిగిపోయింది.