Site icon HashtagU Telugu

Former Minister Satyanarayana: ఏపీలో విషాదం.. మాజీ మంత్రి క‌న్నుమూత‌

Former Minister Satyanarayana

Former Minister Satyanarayana

Former Minister Satyanarayana: మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ (Former Minister Satyanarayana) క‌న్నుమూశారు. వ‌య‌సురీత్యా వ‌చ్చిన అనారోగ్య కార‌ణాల‌తో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. అన‌కాప‌ల్లి జిల్లా చీడికాడ మండ‌లం పెద‌గోగాడ‌లో తుదిశ్వాస విడిచిన‌ట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. రెడ్డి స‌త్య‌నారాయ‌ణ‌ మాడుగుల నియోజకవర్గం నుంచి టీడీపీ త‌ర‌పున‌ వ‌రుస‌గా 1983, 1985, 1989, 1994, 1999లో ఐదు సార్లు గెలిచారు. ఎన్టీఆర్ హ‌యాంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన ఘ‌న‌త ఆయ‌న‌కు ఉంది. ఎన్టీఆర్ స‌మ‌యంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా రెడ్డి సత్యనారాయణ పనిచేశారు.

సీఎం చంద్ర‌బాబు సంతాపం

మాజీ మంత్రి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి బాధాక‌రం అని అన్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని ఆయ‌న ప్ర‌శంసించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి బాధాకరం. 5 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా, మంత్రిగా మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం. రెడ్డి సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

Also Read: Women Security : భార్యలను వదిలేస్తున్న ప్రవాస అల్లుళ్లకు చెక్.. ఎన్‌ఆర్‌ఐ సెల్‌ తడాఖా

అయ‌న్న‌పాత్రుడు సంతాపం

టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. వారు పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు ట్వీట్ చేశారు.