Site icon HashtagU Telugu

AP Results 2024: జగన్ అడ్డాలో ఈ సారి టీడీపీ రాణించేనా ?

AP Results 2024

AP Results 2024

AP Results 2024: రాయలసీమ రాజకీయాలకు పెట్టింది పేరు. అక్కడి ప్రజలను ప్రసన్నం చేసుకుంటే విజయం నల్లేరు మీద నడకలా భావిస్తుంటారు రాజకీయ పార్టీలు. ఇక్కడ రాజకీయాలు ప్రత్యేకం. అభిమానం చూపిస్తే ఎలాంటి ప్రలోభాలకు లొంగని తత్త్వం ఇక్కడి ప్రజల సొంతం. ఇదే రాయలసీమలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజారిటీ సాధించారు. ఉన్న అసెంబ్లీ సీట్లను దాదాపు గెలుచుకున్నారు. దీంతో రాయలసీమలో సీఎం జగన్ కు తిరుగులేకుండా పోయింది. విశేషం ఏంటంటే ఇదే రాయలసీమ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పోటీ చేశారు. కాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాయలసీమ ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ గడ్డపై ఎక్కువ స్థానాల్లో గెలుచుకునే పార్టీ ఏదోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ గడ్డని సొంతం చేసుకునే పార్టీపై భారీగా బెట్టింగ్ జరుగుతుండటం విశేషం. (AP Results 2024)

ఉమ్మడి రాయలసీమ జిల్లాలో కడపలో 10 అసెంబ్లీ స్థానాలు, కర్నూల్ లో 14 సీట్లు , చిత్తూరులో 14, అనంతపురంలో 14 స్థానాలు ఉన్నాయి. కాగా 2019 ఎన్నికల ఫలితాల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 49 చోట్ల వైసీపీ విజయ ఢంకా మోగించింది. అటు 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాగా రాయలసీమ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు చోట్ల మాత్రమే నెగ్గింది. హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలిచారు. మరి గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ నేపథ్యంలో రాయలసీమలో ఈ సారి టీడీపీ సీట్లు పెంచుకుంటుందా లేదా చూడాలి. అటు జగన్ తమ సీట్లను కాపాడుకుంటాడా కూడా ఆసక్తిగా మారింది.

Also Read: Election Results 2024 : కాసేపట్లో ప్రజా ‘తీర్పు’.. ఎన్డీయేనా ? ఇండియానా ?