Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆయన ఇప్పటివరకు చాలా పుస్తకాలు చదివారు. కమ్యూనిజం, ప్రజాస్వామిక వాదం, ప్రజా పాలన వంటి అంశాలపై ఇప్పటిదాకా ఎన్నో బుక్స్‌ను పవన్(Pawan Kalyan) చదివారు. అందుకే ఆయన ప్రసంగాల్లో ఆ నాలెడ్జ్ స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇతరులకు కూడా చాలా బుక్స్‌ను పవన్ రికమెండ్ చేస్తుంటారు. పుస్తకాలు చదివే దిశగా ఎంతోమంది ఫ్యాన్స్‌ను పవన్ కల్యాణ్ ఎంకరేజ్ చేశారు. తాజాగా ఇవాళ ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పుస్తక మహోత్సవాన్ని పవన్ కల్యాణ్ సందర్శించారు. భద్రతా కారణాలతో ఈ విషయాన్ని ముందే వెల్లడించలేదు. మొత్తం మీద పుస్తక మహోత్సవం జరుగుతున్న మొత్తం ప్రాంగణంలో పవన్ కలియ తిరిగారు. అన్ని షెల్ఫ్‌లలో ఉన్న పుస్తకాలను చూశారు. వాటిలో తనకు వ్యక్తిగతంగా ఆసక్తిని రేకెత్తించిన పలు పుస్తకాలను కొన్నారు.
Also Read :Allu Arjun : అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టులో ఊరట.. బెయిల్ షరతుల నుంచి మినహాయింపు
విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వాహకులతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. రూ.10 లక్షలతో పుస్తకాల కోసం వారికి ఆర్డర్ ఇచ్చారు. ఇందుకుగానూ పవన్ కల్యాణ్‌కు పుస్తక మహోత్సవ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత డబ్బు నుంచి ఇంతపెద్ద ఆర్డర్ ఇవ్వడం చాలా గొప్ప విషయమని వారు కొనియాడారు. ఇంతకీ రూ.10 లక్షల పుస్తకాలను పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారా ? పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో త్వరలోనే అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ ఏర్పాటు కానుంది. ఆ లైబ్రరీకి తన తరఫున రూ.10 లక్షల పుస్తకాలను పవన్ కల్యాణ్ గిఫ్టుగా అందిస్తారట. ఆ లైబ్రరీ పిఠాపురం యువతకు బాగా ఉపయోగపడుతుందని పవన్ ఆశిస్తున్నారట. కాగా, విజయవాడలో పుస్తక మహోత్సవం జనవరి 2 నుంచి జరుగుతోంది. ఎంతోమంది పుస్తక ప్రియులు హాజరై అక్కడ పుస్తకాలను కొంటున్నారు.