Site icon HashtagU Telugu

AP Congress : చేరికల రేసులో కాంగ్రెస్ వెనుకంజ.. ఎన్నికల రేసులో ఏమయ్యేనో ?

Ap Congress

Ap Congress

AP Congress : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైఎస్సార్ సీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చకచకా పావులు కదుతుపుతున్నాయి. కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హవా నడిపించిన కాంగ్రెస్ మాత్రం సైలెంట్ మోడ్‌లో కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకొన్ని నెలల టైమే ఉన్నందున.. చాలామంది నాయకులు పార్టీలు మారడం  మొదలుపెట్టారు. వైఎస్సార్ సీపీ చాలాచోట్ల కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. దీంతో ఆయా చోట్ల సీట్లు దక్కనివారు టీడీపీలోకి జంప్ చేస్తున్నారు. ఇక కొత్తగా పాలిటిక్స్‌లోకి వస్తున్నవారు కూడా టీడీపీ, వైఎస్సార్ సీపీ, జనసేనలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి ఏపీలో కాంగ్రెస్‌కు ప్రజాదరణ ఎంతగా తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితిని మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం(AP Congress) కసరత్తును మొదలుపెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలను అప్పగించాలనే వ్యూహంతో హస్తం పార్టీ ఉంది. దీనిపై రేపటికల్లా(జనవరి 17) ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. అదే జరిగితే.. కాంగ్రెస్‌కు కొంత జోష్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. వైఎస్సార్ కుమార్తెగా షర్మిలకు ఉన్న పేరు.. గతంలో ఏపీలో పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన తీరు కాంగ్రెస్‌కు ప్లస్ పాయింట్లుగా మారే ఛాన్స్ ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి పార్టీలు మారుతున్న నాయకులు కాంగ్రెస్ పార్టీని అస్సలు లెక్కలోకే తీసుకోవడం లేదని ఇంకొందరు పరిశీలకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలను అప్పగించాక.. జనంతో పార్టీకి కనెక్టివిటీని పెంచడం అనే అతిపెద్ద టాస్క్ ఎదురవుతుంది. పదేళ్ల క్రితం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏపీ ప్రజలకు కాంగ్రెస్‌పై సన్నగిల్లిన నమ్మకాన్ని మళ్లీ పెంచేలా ప్రజలతో కాంగ్రెస్ మమేకం కావాలి. అలా అయితేనే పార్టీలు మారేందుకు రెడీ అవుతున్న నాయకులు.. కాంగ్రెస్ వైపు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది.

Also Read: ED – Kavitha : కవితకు ఈడీ సమన్లు.. బీఆర్ఎస్‌కు బీజేపీ ‘బీ టీమ్’ కాదని నమ్మించేందుకే : కాంగ్రెస్

చేరికలన్నీ ఆ పార్టీలలోకే.. కాంగ్రెస్ వైపు చూడని వైనం

Exit mobile version