Site icon HashtagU Telugu

Bapatla: బాపట్లలో రెండు బీచ్‌లు మూసివేత

Bapatla

Bapatla

Bapatla: ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో ఉన్న రెండు బీచ్‌లను స్థానిక పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. గత వారంలో ఈ బీచ్ లో ఆరుగురు వ్యక్తులు మునిగి మరణించిన నేపథ్యంలో ప్రజలను సముద్రంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. బాపట్ల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో ఆరుగురు వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారని, ఫలితంగా సూర్యలంక, వాడ్రేవు బీచ్‌లలో నీళ్లలోకి ప్రవేశించకుండా పోలీసులు నిషేధం విధించారని తెలిపారు.

కొంతమంది మోకాళ్ల లోతు వరకు మాత్రమే వెళ్లినప్పటికీ, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నట్లు ఎస్పీ తెలిపారు. వాస్తవానికి ఈ బీచ్ లో గత వారంలో ఈ బీచ్ లో 14 మందిని రక్షించారు. ఈ సంవత్సరం సముద్రం మరింత ఉధృతంగా ఉందని జిందాల్ చెప్పారు. అయితే పోలీసులు అన్ని చోట్లా ఎల్లవేళలా ఉండలేరు కాబట్టి అందరినీ రక్షించలేమని చెప్పారు.

76 కి.మీ పొడవైన తీరప్రాంతంతో బాపట్ల బీచ్‌లు రాష్ట్రంలో మరియు వెలుపల నుండి అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. వారాంతాల్లో దాదాపు 15,000 మంది సందర్శకులు వస్తారని జిందాల్ చెప్పారు.

Also Read: AP Minister’s Chambers: సెక్రటేరియట్‌లో ఏ మంత్రులకు ఎక్కడ ఛాంబర్లు ఇచ్చారు..?

Exit mobile version