Andhra Odisha Border : ఆంధ్రా-ఒడిశా బార్డర్‌లో (ఏవోబీ) గంజాయి గుప్పుమంటోంది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 30 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో అత్యధిక శాతం ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి సప్లై అయిందే. ఈమేరకు వివరాలతో ‘డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్’ (డీఆర్‌ఐ) ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా-2023-24’’ పేరుతో ఈ నివేదికను రిలీజ్ చేసింది.
Also Read :Mass Jailbreaks : పరారీలోనే 700 మంది ఖైదీలు.. వారిలో 70 మంది ఉగ్రవాదులు!
డీఆర్ఐ నివేదికలోని కీలక అంశాలివీ..
- ఆంధ్రా – ఒడిశా బార్డర్(Andhra Odisha Border)లో ‘శీలావతి’ అనే రకానికి చెందిన గంజాయి పెద్ద ఎత్తున సాగవుతుంటుంది. దేశవ్యాప్తంగా సోదాల్లో వివిధ దర్యాప్తు సంస్థలకు దొరుకుతున్న గంజాయిలో ఎక్కువ భాగం ఈ రకం గంజాయే ఉంటోంది.
- 2023 సంవత్సరం నవంబరులో విజయవాడ శివార్లలో 731 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- నాగ్‌పూర్ – జబల్‌పుర్ జాతీయ రహదారిపై 386.29 కిలోల గంజాయిని, బోర్క్‌హెడి టోల్‌ప్లాజా వద్ద 520 కిలోల గంజాయి, ఇదే టోల్ ప్లాజా వద్ద మరోసారి 975.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- పైన మనం చెప్పుకున్న చోట్లలో దొరికిన గంజాయి అంతా ఏవోబీ నుంచి సప్లై అయిందేనని దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
- అసోం, మణిపూర్, మిజోరం, సిక్కిం లాంటి ఈశాన్య రాష్ట్రాలలో గంజాయి ఎక్కడ దొరికినా.. దాని సప్లై చైన్ ఆంధ్రా- ఒడిశా బార్డర్‌లోనే ఉందని బయటపడుతోంది.
- మన దేశంలో ప్రధానంగా నాలుగు రకాల గంజాయి సాగవుతుంటుంది. వాటి పేర్లు.. ఇడుక్కి గోల్డ్, మైసూర్ గోల్డ్, మలానా క్రీమ్, శీలావతి. శీలావతి రకం గంజాయి ఏవోబీ ఏరియాలోనే లభిస్తుంది.
- గంజాయిని ప్రాసెస్ చేసి దాని నుంచి తీసిన హాషిస్ ఆయిల్‌ను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
- గంజాయిని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను వాడుతున్నారు. వివిధ రూపాల్లోకి దాన్ని మార్చేసి విక్రయిస్తున్నారు.