CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర, స్వచ్ దివాన్ పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జనవరి నెలలో ‘న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్’ అనే అంశాన్ని థీమ్‌గా తీసుకోవడంతో, ఫిబ్రవరి నెలలో ‘సోర్స్ రీ సోర్స్’ అనే కొత్త థీమ్‌ను సూచించారు. ఈ థీమ్ ద్వారా రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి సాధించే దిశగా అధికారి, అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. జీవిత ప్రమాణాలను పెంచడం, పర్యాటక రంగంలో ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, రాష్ట్రంలో పర్యావరణం శుభ్రముగా ఉండి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడం అనే అంశాల్లో పని చేయాలని చంద్రబాబు సూచించారు.
Vinod Kumar : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు బోయినపల్లి వినోద్ కుమార్ కౌంటర్
ఇక, స్వచ్చాంధ్ర కోసం, పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్య సంరక్షణ, కేంద్రం నిర్దేశించిన లక్ష్యాల ఆధారంగా ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్వచ్చాంధ్ర అంటే శుభ్రమైన మనసులు, శుభ్రమైన పరిసరాలు, శుభ్రమైన ఇళ్లను కోరుతున్నట్లు తెలిపారు. ఇళ్లతో పాటు బహిరంగ ప్రదేశాలు, స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. స్వచ్ఛత, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఆ తరువాత, బీసీ సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశంలో చంద్రబాబు ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను ఆడిపెట్టిందని, వారి హత్యలపై త్వరితగతిన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు. ఈ అంశం మ్యానిఫెస్టోలో కూడా ప్రతిపాదించమని చంద్రబాబు సూచించారు. అలాగే, బీసీ విద్యార్థుల డైట్ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పారు. నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. బీసీ రక్షణ చట్టం త్వరలో రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని, సబ్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే, బీసీ సంక్షేమాన్ని పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇక, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కోసం న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. అంతేకాక, ప్రతి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించే విషయంలో దామాషా ప్రకారం ప్రణాళికలు రూపొందించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.
Sri Lanka vs Australia: శ్రీలంక సంచలనం.. 43 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన లంక!