Ammireddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 04:52 PM IST

DIG Ammireddy: లోక్‌సభ ఎన్నికల వేళ అనంతనపురం డీఐజీ అమ్మిరెడ్డి(DIG Ammireddy)పై ఎన్నికల సంఘం(Election Commission) బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆయను తక్షణమే విధుల నుండి తప్పుకోవాలని ఆదేశించింది. అమ్మిరెడ్డికి ఎన్నికల విధులు అప్పగించొద్దని సీఎస్‌ జవహర్‌ రెడ్డిని ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇటీవల అనంతంపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త డీజీపీని ఎన్నికల సంఘం నియమించనుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికార వైకాపాకు అంటకాగుతున్న పలువురు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపిస్తున్న విషయం తెల్సిందే.

Read Also: Heat Wave: హీట్ వేవ్ తో మెంటల్ టెన్షన్.. ఈ టిప్స్ ఫాలోఅయ్యిపోండి!

మరోవైపు ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పై ఎన్నికల సంఘం(EC) ఆదివారం బదిలీ వేటు వేసింది. ఆయనను తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఈసీ ఆదేశించింది. డీజీపీని బదిలీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ని ఈసీ ఆదేశించింది. డీజీపీ పదవికి ముగ్గురు పేర్లతో ప్యానల్ పంపాలని ఎన్నికల సంఘం సీఎస్ కు సూచించింది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో నిష్పక్షపాత ఎన్నికలు జరిగేందుకు సీఎస్ , డీజీపీని బదిలీ చేయాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై కూడా ఈసీ(EC) బదిలీ వేటు చేసింది. డీఎస్పీపై అందిన ఫిర్యాదుల మేరకు ఈసీ ఈ చర్యలు తీసుకుంది. అనంతపురం అర్బన్ డీఎస్పీ వీర రాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాను ఈసీ బదిలీ చేసింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.