Site icon HashtagU Telugu

CM Jagan : భార్య డైరెక్టర్ గా ఉన్న సాక్షితో జగన్ కు సంబంధం లేదా?: ఆనం వెంకటరమణారెడ్డి

Tirupati Laddu

Tirupati Laddu

టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి(Anam Venkataramana Reddy) సిఎం జగన్‌(CM Jagan) మరోసారి మండిపడ్డారు. తనకు మీడియా లేదని, సాక్షి టీవీ, సాక్షి పత్రిక తనది కాదని జగన్ నాటకాలు ఆడుతున్నారంటూ సాక్షి మీడియా జగన్ దేనని, వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయని ఆయన చెప్పారు. జగన్ లక్కీ నెంబర్ లక్ష అని… లక్ష రూపాయల పెట్టుబడితో ఆయన పెట్టిన కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జగతి పబ్లికేషన్స్ కూడా లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించినదేనని వెంకటరమణారెడ్డి అన్నారు. ఇందులో విజయసాయిరెడ్డి రూ. 35 వేలు, జె.జగన్ మోహన్ రెడ్డి రూ. 30 వేలు, కామత్ అనే వ్యక్తి రూ. 35 వేలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. తొలుత సాక్షి డైరెక్టర్ గా విజయసాయిరెడ్డి ఉన్నారని, ఆయన రాజీనామా చేసిన తర్వాత జగన్ డైరెక్టర్ అయ్యారని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా డైరెక్టర్ గా పని చేశారని తెలిపారు. ప్రస్తుతం వైఎస్ భారతి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. భార్య డైరెక్టర్ గా ఉన్న సాక్షితో జగన్ కు సంబంధం లేదా? అని ఎద్దేవా చేశారు. సాక్షితో తనకు సంబంధం లేదని జగన్ పచ్చి అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు.

కాగా, ఎన్నికల ప్రలోభాల్లో వైఎస్‌ఆర్‌సిపి కొత్త ట్రెండ్‌ సెట్ చేస్తోంది. సొంత పార్టీ నేతలకే కరెన్సీ కట్టలను ఎర వేస్తోంది. ఓటర్లను ప్రభావితం చేసే నాయకుడి స్థాయిని బట్టి ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి 15 లక్షల వరకూ పంపిణీ చేస్తున్నారు. అవినాష్‌రెడ్డి సారథ్యంలో జగన్‌ ఇలాకాలోనే ఈ కార్యక్రమం అమలవుతోంది. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్‌ సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. ఐదేళ్లలో ఎన్నడూలేని విధంగా పులివెందులలో కార్యకర్తలకు జగన్‌ భరోసా పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీన్ని తెరవెనక నడిపించేది ఎవరైనా, తెరముందు అవినాష్‌రెడ్డి అన్నీతానై చూసుకుంటున్నారు.

Read Also : vastu tips: బాత్రూంలో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే వెంటనే వాటిని తీసేయండి?