Supreme Court: ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై `సుప్రీం` ఆరా

సుప్రీం కోర్టు అమిక‌స్ క్యూరీ స‌ల‌హాను పాటిస్తే దేశంలోని స‌గం చ‌ట్ట‌స‌భ‌లు ఖాళీ అవుతాయ‌ని అంచ‌నా వేయొచ్చు. నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న ప్ర‌జాప్ర‌తినిధులు పార్ల‌మెంట్ నుంచి ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్నారు.

  • Written By:
  • Updated On - November 15, 2022 / 03:25 PM IST

సుప్రీం కోర్టు అమిక‌స్ క్యూరీ స‌ల‌హాను పాటిస్తే దేశంలోని స‌గం చ‌ట్ట‌స‌భ‌లు ఖాళీ అవుతాయ‌ని అంచ‌నా వేయొచ్చు. నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న ప్ర‌జాప్ర‌తినిధులు పార్ల‌మెంట్ నుంచి ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్నారు. అధికారిక లెక్కల ప్ర‌కారం ఆర్థిక నేరాల‌తో పాటు లైంగిక‌, అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్న ప్ర‌జాప్రతినిధులు సుమారు 30శాతం మంది ఉన్నారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో 50శాతానికి పైగా నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న లీడ‌ర్లు ఉన్నార‌ని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెబుతోంది.

Also Read:  Farm House Files: జ‌గ‌న్, మోడీ బంధానికి కేసీఆర్ పొగ‌

దేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదై విచారణ ముందుకు సాగకుండా పెండింగ్ లో ఉన్న కేసులపైనే ముందుగా విచారణ సాగించేలా ట్రయల్ కోర్టుల్ని, హైకోర్టుల్ని ఆదేశించాలని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియీ సలహా ఇచ్చారు. ట్రయల్ కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసుల్ని మిగతా కేసుల కంటే ముందు విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఐదేళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న కేసులపై ఫాస్ట్ ట్రాక్ విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అమిక‌స్ క్యూరీ కోర‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల వివ‌రాల‌ను ఇవ్వాల‌నిసుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్ని గతంలో ఆదేశించింది. దేశంలోని 16 హైకోర్టులు మిన‌హా మిగిలిన‌వి ఇవ్వ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాటిలో తెలంగాణ సహా 9 హైకోర్టులు ఉన్నాయ‌ని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా గుర్తు చేశారు. ఆయా హైకోర్టులు వెంటనే ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.

Also Read:  AP Factories: డేంజ‌ర్ లో ఏపీ ప‌రిశ్ర‌మ‌లు, పైర‌వీల హ‌వా!

ముఖ్యంగా ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసుల విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో సాగేలా అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు కీలక సిఫార్సులు చేశారు. ఇందులో ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని ట్రయల్ కోర్టులు ముందుగా విచారించేలా హైకోర్టులు తగిన ఆదేశాలు ఇచ్చేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఈ కేసుల విచార‌ణ‌కు వాయిదాలకు అనుమతించకూడదు, అందుకు లాయర్లు సహకరించాల‌ని పేర్కొన్నారు. అసాధారణ పరిస్ధితుల్లో వాయిదా పడితే వాటి వివరాలు నమోదు చేయాల‌ని సూచించారు. ఈ కేసుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి తగు ఆదేశాలివ్వాలి.

క్యూరి కొన్ని సూచ‌న‌ల‌ను చేశారు. వాటిలో `ట్రయల్ జాప్యానికి నిందితులు కారణమైతే వారి బెయిల్ రద్దు చేయాలి. మరణశిక్ష, ఏడేళ్లకు పైగా శిక్షలకు అర్హత ఉన్న కేసుల విచారణ ముందుగా చేపట్టాలి. ఫోరెన్సిక్ అంశాల్లో ల్యాబ్ లు అత్యవసరంగా రిపోర్టులు పంపాలి. కోర్టు కోరిన రోజు నిందితుల్ని హాజరుపర్చకపోతే పోలీసులకు నాన్ బెయిలబుల్ వారంట్లు పంపాలి. నిందితులు, సాక్ష్యుల్ని కోర్టుల ముందు హాజరుపర్చని పోలీసుల నుంచి కోర్టులు వివరణ కోరేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయాలని అమికస్ క్యూరీ కోర‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆలోచింప‌చేస్తోంది.

Also Read:  CBN Media: చంద్ర‌బాబు సానుభూతి మీడియాకు స‌రైనోడు..!