US Girl – AP Boy: ఏపీ అబ్బాయి కోసం అమెరికా అమ్మాయి వచ్చేసింది!

కట్ చేస్తే.. తాజాగా జాక్లిన్ ఫొరేరో(US Girl - AP Boy) తన తల్లితో కలిసి ఇండియాలో ల్యాండ్ అయింది.

Published By: HashtagU Telugu Desk
Us Girl Ap Boy American Girl Jacqueline Forero Andhra Boy Chandan

US Girl – AP Boy: ఆంధ్రా అబ్బాయిని కలిసేందుకు అమెరికా అమ్మాయి భారత్‌కు చేరుకుంది. దీంతో ఇప్పుడు అందరూ ఆ ఇద్దరి గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.  వారి నేపథ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  జాక్లిన్ ఫొరేరో ఒక అమెరికన్ ఫొటోగ్రఫర్. ఆమెకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక పల్లెటూరుకు చెందిన చందన్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫ్రెండ్స్ అయ్యారు. తొలుత వీరిద్దరూ టెక్ట్స్ మెసేజ్‌లతో ఛాట్ చేసుకునేవారు. నిత్యం ఒకరికొకరు టచ్‌లో ఉండేవారు. ఆతర్వాత వీడియో కాల్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈవిధంగా 14 నెలల పాటు  జాక్లిన్ ఫొరేరో, చందన్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో టచ్‌లో ఉన్నారు.

Also Read :Phone Tapping Case : అమెరికాలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్.. పాస్‌పోర్ట్ రద్దు.. అదొక్కటే దిక్కు!

జాక్లిన్ ఫొరేరో తల్లితో కలిసి..

కట్ చేస్తే.. తాజాగా జాక్లిన్ ఫొరేరో(US Girl – AP Boy) తన తల్లితో కలిసి ఇండియాలో ల్యాండ్ అయింది. తాను దిగిన ఎయిర్ పోర్టు సమాచారాన్ని చందన్‌కు పంపింది. దీంతో చందన్ రెక్కలు కట్టుకొని అక్కడ వాలాడు. అక్కడ పరుగుపరుగున వచ్చిన జాక్లిన్.. చందన్‌ను కౌగిలించింది. అతడిని ముద్దులతో ముంచెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తాజాగా భారత్‌కు వచ్చాక ఇన్‌స్టా‌గ్రామ్‌లో మరో పోస్ట్ చేసిన జాక్లిన్.. ‘‘నేను చందన్ కంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదాన్ని. ఎట్టకేలకు చందన్‌ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం పెళ్లి చేసుకొని తీరుతాం’’ అని వెల్లడించింది.

Also Read :Salman Khan Marriage: సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోకపోవడానికి అలాంటి కారణముందా ?

నెటిజన్ల స్పందన ఇదీ.. 

ఈ అంశంపై నెటిజన్లు కూడా స్వేచ్ఛగా స్పందిస్తున్నారు. చందన్‌కు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. ‘‘జాక్లిన్ నీకు మంచి ప్రేమికుడు దొరికాడు. చందన్ కళ్లలో నిజాయితీ కనిపిస్తోంది’’ అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.    జాక్లిన్, చందన్‌లు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్‌ను కూడా నడుపుతున్నట్లు తెలిసింది. పబ్జీ గేమ్‌లో మొదలైన పరిచయంతో భారత దేశ యువకుడిని ప్రేమించి, పాకిస్తాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ వ్యవహారం మనకు గుర్తుంది. ఇప్పుడు జాక్లిన్ ఫొరేరో కూడా ఆ లిస్టులో చేరిపోయారు.

  Last Updated: 09 Apr 2025, 06:26 PM IST