Site icon HashtagU Telugu

Big Breaking : జనసేన లోకి అంబటి రాయుడు..?

Rayudu Janasena

Rayudu Janasena

వైసీపీ పార్టీ లో చేరిన వారం రోజుల్లోనే ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకు వచ్చిన ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu)..ఇప్పుడు జనసేన పార్టీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. కొద్దీ సేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జనసేన లో చేరే అంశం ఫై ఇరువురు చర్చించారు. దీనిపై జనసేన కానీ , రాయుడు కానీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ(YCP) పార్టీకి ప్రతి రోజు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. పార్టీ లో సీనియర్ నేతలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు మాత్రమే కాదు కొత్తగా పార్టీ లో చేరిన వారు సైతం పార్టీ కి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. వారం క్రితం ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) వైసీపీ లో చేరిన సంగతి తెలిసిందే. అంబటి రాయుడు పార్టీ లో చేరడం తో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇక గెలుపు మాదే అన్నట్లు తెగ హడావిడి చేసారు. కానీ అంబటి రాయుడు మాత్రం పట్టుమని పది రోజులు గడవకముందే రాజీనామా (Ambati Rayudu quit From YCP) చేస్తున్నట్లు ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చారు. ” రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న..తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తా..” అని పోస్ట్ చేసాడు.

వాస్తవానికి రాయుడు గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి..వైసీపీ లో చేరారని..కాకపోతే వైసీపీ టికెట్ ఇవ్వమని చెప్పడం తో ఆయన రాజీనామా చేసారని కథనాలు ప్రచారం అయ్యాయి. కానీ ఇప్పుడు జనసేన లో చేరుతున్నాడని తెలుస్తుంది. మరి గుంటూరు టికెట్ రాయుడు కు ఇస్తామని జనసేన ఏమైనా హామీ ఇచ్చిందా..? అసలు టికెటే ఆశించకుండా రాయుడు జనసేన లో చేరబోతున్నాడా..? అనేది చూడాలి. ఏదిఏమైనప్పటికీ వైసీపీ నుండి జనసేన లో చేరబోతుండడం తో రాయుడు మరోసారి వార్తల్లో హైలైట్ అవుతున్నారు.

Read Also : MLA Kapu : కాంగ్రెస్ వైపు కాపు చూపు..?