Site icon HashtagU Telugu

Ambati Rambabu : ఇది ‘మంచి ప్రభుత్వం’ కాదు ముంచిన ప్రభుత్వం

Rambabu Idi Manchi Prabuthv

Rambabu Idi Manchi Prabuthv

Idi Manchi Prabhutvam Programme : నేటితో (సెప్టెంబర్ 20) కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ప్రభుత్వం ‘ఇది మంచి ప్రభుత్వం’ (Idhi Manchi Prabhutvam) పేరుతో ప్రజల్లోకి వెళ్ళింది. ఈరోజు నుండి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించడం మొదలుపెట్టారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ కార్య క్రమం ఫై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సెటైర్లు వేశారు. ‘వంద రోజుల పాలనలో ఏమున్నది గర్వకారణం. పథకాల ఎగవేతలు. పరపార్టీపై నిందలు. రెడ్ బుక్ పీడనలు. ఇది ముంచిన ప్రభుత్వం’ అని విమర్శించారు. అలాగే జగన్ సైతం ప్రభుత్వం వందల రోజుల పాలనపై పలు విమర్శలు చేసారు. చంద్రబాబుది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసం అని జగన్ (Jagan) పేర్కొన్నారు. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదు. వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే.. మోసమే అన్నారు. అన్నీ వ్యవస్థలు తిరోగమనం చేస్తున్నారు. ఇలా మొట్ట మొదటిసారిగా చూస్తున్నానని తెలిపారు. గతంలో పిల్లలకు విద్యాదీవెన, వసతి దీవెన అందేది. 9 నెలల్లో ఇంతవరకు ఏది అందలేదన్నారు.

ప్రజలకు చెప్పినవన్ని కూడా అబద్దాల మూటగా 100 రోజుల తరువాత చంద్రబాబు దోషిగా నిలబడతారు. స్కూళ్లన్నీ పూర్తిగా నిర్వర్యమయ్యారు. రైతులు పూర్తిగా రోడ్డున పడ్డారు. రైతులకు అందాల్సిన సహాయం అందలేదు. మా హయాంలో ఇస్తామన్న పెట్టుబడి కూడా ఇవ్వలేదు. రైతులకు ఉచిత పంట బీమా లేదు. ఈ క్రాపింగ్ లేదు. రైతుల పరిస్థితి అద్వానంగా మారింది. ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఏ రంగం చూసుకున్నా.. తిరోగమనమే అన్నారు. గతంలో ప్రతీ రంగంలో పారదర్శకంగా జరిగేది అని మాజీ సీఎం జగన్ తెలిపారు. విజయవాడ వరదలు కూడా ప్రభుత్వం అలసత్వమే అని విమర్శించారు. వరద ప్రమాదం పొంచి ఉందని ముందే హెచ్చరించినా.. సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపించారు. బుడమేరు, ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ అని వాపోయారు. వీటిని డైవర్ట్ చేసేందుకు.. చంద్రబాబు ప్రకాశం బ్యారేజీలో బోట్లు అడ్డుపడ్డాయని కొత్త టాపిక్ తెచ్చారన్నారు. అసలు ఆ బోట్లను అక్కడ పెట్టుకున్నదే చంద్రబాబు అని, ఇసుక మాఫియా కోసమే చంద్రబాబు ఆ బోట్లను అక్కడ పెట్టుకున్నాడని ఆరోపించారు.

Read Also : Health Tips : ఏ సమయంలో ఎండుద్రాక్ష తినడం ఎక్కువ ప్రయోజనకరం..?