Site icon HashtagU Telugu

Prakasam Barrage Boats Crash Case : జగన్ అంటే భయం వల్లే ఇలాంటి కుట్రలు-అంబటి రాంబాబు

Ambati Rambabu Reacts Praka

Ambati Rambabu Reacts Praka

Ambati Rambabu Reacts Prakasam Barrage Boats Crash Case : మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన నోటికి పనిచెప్పారు. సీఎం చంద్రబాబు ఫై విమర్శలు చేసారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఢీ అంశంపై టీడీపీ – వైసీపీ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బ్యారేజ్ లోకి నాల్గు బొట్లు కొట్టుకవచ్చి..గేట్లను బలంగా తగలడం తో అవి డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం వాటి మరమత్తులు ప్రభుత్వం చేసింది. కాకపోతే ఈ బొట్లు పలువురు వైసీపీ నేతలకు చెందడం తో వైసీపీ కుట్రలో భాగమే ఈ డ్యామేజ్ అని టీడీపీ ఆరోపిస్తుంది.

ఈ ఘటన కు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు..వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ (MLC Talasila Raghuram ), మాజీ ఎంపీ నందిగం సురేష్​ (Ex MP Nandigam Suresh) అనుచరుల బోట్లుగా గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్​, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకున్నారని నివేదికలో పేర్కోవడం జరిగింది.

ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ట్విట్టర్ వేదికగా కీలక ట్వీట్ చేసారు. ప్రకాశం బ్యారేజీ కూల్చి లక్ష మందికిపైగా ప్రజలను చంపటమే జగన్ లక్ష్యమని లోకేష్ ఆరోపించారు. ‘అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాలు లేకుండా చేయాలని పన్నిన కుట్ర బట్టబయలైంది’ అని ట్వీట్ చేశారు.

చంద్రబాబు (Chandrababu) దారుణంగా దిగజారుడు రాజకీయాలు

టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ కౌంటర్ ఇస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు దీనిపై స్పందించగా..తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) రియాక్ట్ అయ్యారు. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లు టీడీపీ నేతలవే అని రాంబాబు అన్నారు. చంద్రబాబు వైసీపీ నేతలవే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జగన్ అంటే భయం వల్లే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఫైరయ్యారు. మూడు నెలల్లోనే చంద్రబాబు అప్రతిష్ఠపాలయ్యారని, ఆయన విజనరీ లీడర్ కాదని మండిపడ్డారు. చంద్రబాబు దారుణంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి, ఈ వయసులో ఎందుకీ కుట్రలు, కుతంత్రాలు? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు విజనరీ, అడ్మినిస్ట్రేషన్‌ ఏమైందన్న ఆయన, ఈ వరదల్లో ప్రజల ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలన్న చంద్రబాబు, విజయవాడ వరదల సంక్షోభంతో వైసీపీ నాయకులపై కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారని రాంబాబు అన్నారు.

వరద ఉధృతికి పైనుంచి అనేక పడవలు కొట్టుకవచ్చాయి

నిజానికి ప్రకాశం బ్యారేజ్‌ను కేవలం ఆ మూడు పడవలే కాకుండా, ఇంకా చాలా బోట్లు ఢీకొట్టాయని వెల్లడించారు. దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఈ మధ్యకాలంలో ఎన్నడూ రాలేదని, ఆ వరద ఉధృతికి పైనుంచి అనేక పడవలు కొట్టుకొచ్చాయని, వాటిలో టూరిజమ్‌ బోట్లు కూడా ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు అంతగా ఎందుకు భయపడుతున్నారంటే.. జగన్ వెనకున్న 40 శాతం ఓట్లు. ఇంకా కూటమి గెలుపు వారిది కాదన్న భయం. అందుకే జగన్‌ గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు’.. అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఏ పడవలకైనా నీలి, పసుపు రంగులే ఉంటాయన్న ఆయన, కావాలంటే ఏ పోర్టుకైనా వెళ్లి చూడాలని హితవు పలికారు.

Read Also : Health Tips : డాక్టర్ సలహా లేకుండా ఈ మందులను ఎప్పుడూ తీసుకోకండి..!