Site icon HashtagU Telugu

TDP : టీడీపీ ‘మోత మోగిద్దాం’ పిలుపు ఫై అంబటి రాంబాబు కామెంట్స్ ..

Amabti React Mothamogiddam

Amabti React Mothamogiddam

రేపు జగన్ ప్యాలెస్ దద్దరిల్లిపోయేలా ‘మోత మోగిద్దాం’ అంటూ టిడిపి ఇచ్చిన పిలుపు ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. I Am With Babu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన దగ్గరి నుండి కూడా టీడీపీ శ్రేణులు ఆందోళనలు , నిరసనలు , ధర్నాలు చేస్తూ..చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..ఆయనకు సంఘీభావం తెలుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు , టీడీపీ శ్రేణులు బాబు కు సపోర్ట్ ఇస్తూ..ఆయన కు సంఘీభావం తెలుపుతూ వస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరి నుండి పండుముసలి వారు వరకు తమ నిరసనగళం తెలిపారు. ఇక ఇప్పుడు రేపు జగన్ ప్యాలెస్ దద్దరిల్లిపోయేలా ‘మోత మోగిద్దాం’ (Motha Mogiddham) అంటూ టీడీపీ పిలుపునిచ్చింది.

Read Also : Jr NTR : టీడీపీ నేతల వల్లే ..ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ ఫై స్పందించడం లేదా..?

‘నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే 🔊. చంద్రబాబు గారికి మద్దతుగా… సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి’ మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. “5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా ..ఇంట్లోనూ..ఆఫీస్ లోను..ఇంకెక్కడ ఉన్న బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి..లేదా విజిల్ వెయ్యండి. రోడ్ మీద వాహనంతో ఉంటె హారన్ తో కొట్టండి” అంటూ పిలుపునిచ్చారు.

ఈ పిలుపు ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సెటైర్ వేశారు. “విధి విచిత్రమైనది! నాడు కాపు ఉద్యమంలో పళ్లాలు కొట్టినవారిని మక్కెలు విరగ్గొట్టి బొక్కలో వేశావ్! ఇప్పుడు అవినీతిలో కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్.. వారేవా!” అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.

https://x.com/AmbatiRambabu/status/1707738852335772142?