AP : 175 కి 175 గెలవబోతున్నాం – సర్వేలు కూడా ఇదే చెపుతున్నాయి – అంబటి

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 09:05 PM IST

తెలంగాణ ఎన్నికలు ముగిసేసరికి ఇప్పుడు అంత ఆంధ్ర వైపే చూస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ..ఈసారి కూడా విజయం సాధిస్తుందా..? లేదా..? అని ఎవరికీ వారు లెక్కలు వేసుకుంటున్నారు.మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ , జనసేన పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. మేనిఫెస్టో..అభ్యర్థుల ఎంపిక..ప్రత్యర్థి పార్టీని ఎలా ఓడగొట్టాలి..ఎలా యుద్ధం చేయాలి అనేవి కసరత్తులు చేస్తున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ…వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని.. తాజాగా వచ్చిన సర్వే కూడా ఇదే విషయం స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు అవినీతి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి అని.. అవినీతి జరిగిందని అప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చెప్పాడన్నారు. దానిపై పవన్ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పవన్‌కు తన పార్టీపై తనకే స్పష్టత లేదని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాలు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మంత్రి అన్నారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆయన విమర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు బుర్ర పాడై పోయిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యంగా భావిస్తానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే నిన్న పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ మాట్లాడుతూ..ఏపీలో టీడీపీతో పొత్తు పదేళ్లయినా కొనసాగాలని కోరుకుంటున్నామని, రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీ బాగుపడాలంటే తమ పొత్తు కొనసాగాలని వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై కూడా అంబటి రాంబాబు సెటైర్ వేశారు. టీడీపీతో అలయన్స్ దశాబ్దకాలం కావాలంటావ్… మూడు ముళ్లు మాత్రం మూడు రోజుల్లో తెంచేస్తావ్… అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

అలాగే మాజీ మంత్రి పేర్ని నాని సైతం పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కు రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని, చంద్రబాబు మనుగడ కోసమే పవన్ కల్యాణ్ పనిచేస్తాడని అన్నారు. పవన్ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్ లీజుకు ఇచ్చేశాడని ఎద్దేవా చేసారు. తాను నాలుగేళ్ల కిందటే చెప్పానని, పవన్ కల్యాణ్ స్థాపించింది రాజకీయ పార్టీ కాదని, ఒక టెంట్ హౌస్ పార్టీ అని విమర్శించారు. మన ఇళ్లలో పండుగలు, పబ్బాలు, వేడుకలు చేసుకునేందుకు షామియానాలు, కుర్చీలు అద్దెకు తెచ్చుకుంటామని, అలాగే పవన్ కల్యాణ్ కూడా తన పార్టీని అద్దెకు ఇస్తుంటాడని చెప్పుకొచ్చాడు.

Read Also : Lover : ప్రియుడికి మాజీ లవర్ ఉన్న విషయం తెలిసి..కన్నింగ్ లేడీ ఏంచేసిందో తెలుసా..?