Site icon HashtagU Telugu

AP Polling : టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా..? – మంత్రి అంబటి

Ambati Polling

Ambati Polling

నిన్న ఆంధ్రప్రదేశ్‌ (AP)లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేసి నానా బీబత్సం సృష్టించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో బాంబుల మోత మోగాయి. టీడీపీ (TDP) , వైసీపీ (YCP) నేతలు ఒకరిపై దారుణంగా దాడి చేసుకున్నారు. ఈ దాడులపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ నేతలు దారుణాలకు పాల్పడుతుంటే, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అంబటి ఆరోపించారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారా? అంటూ ప్రశ్నించారు. టీడీపీతో కుమ్మక్కయి పోలీసులు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. టీడీపీ వారు దాడులు చేస్తున్నప్పటికీ వారిని అడ్డుకోలేదని.. తనను సైతం తిరగకుండా అడ్డుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. తనను గృహ నిర్బంధం చేస్తున్నట్టు ఎస్పీ ఆదేశాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తన ప్రత్యర్థి (కన్నా) మాత్రం యథేచ్ఛగా అన్ని పోలింగ్ బూత్ లకు తిరిగాడని అంబటి వ్యాఖ్యానించారు.

ఇక పోలింగ్ శాతం పెరగడం ఫై అంబటి స్పందించారు. గతంలో ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని భావించేవాళ్లమని, కానీ ఈసారి సీఎం జగన్ ను మళ్లీ గెలిపించేందుకు మహిళలే భారీగా ముందుకొచ్చారని, 70 శాతం మంది మహిళలు ఫ్యాన్ గుర్తుకే ఓటేశారని తెలిపారు. జగన్ పాలనను చూసిన వారు ఓటు వేయడానికి భారీగా తరలిరావడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.

Read Also ; T20 World Cup: టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ తుది జట్టు ఇదే