ప్రముఖ సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishnamurali) అరెస్టుపై YCP నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రంగా స్పందించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నవారిని అనుచిత వ్యాఖ్యల కోసం అరెస్టు చేయాల్సి వస్తే, రాజకీయ నాయకులందరినీ అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
Deputy CM Bhatti: డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన.. ఆ యూనివర్శిటీ విషయంలో బిగ్ డెసిషన్!
పోసాని వ్యాఖ్యల విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం సమర్థనీయమే కానీ, రాజకీయ కుట్రలో భాగంగా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటే, అన్ని పార్టీ నాయకులపైనా సమానంగా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పోసాని అరెస్టును చాలామంది సమర్దిస్తుంటే , YCP నేతలు మాత్రం దీనిని కుట్రగా చెపుతున్నారు.
ప్రస్తుతం పోలిసుల అదుపులో ఉన్న పోసాని.. పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు సంయుక్తంగా నాలుగు గంటలుగా ఆయనను ప్రశ్నించినా, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా కూర్చున్నారని తెలుస్తోంది. ఆయన సమగ్రంగా విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని, ప్రతి ప్రశ్నను దాటవేస్తూ ఉండటంతో పోలీసులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి.