Amaravathi Capital : సుప్రీంలో జ‌గన్ కు మ‌రో షాక్‌! అమ‌రావ‌తి రాజ‌ధాని పదిలం!!

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న కార్య‌రూపం దాల్చ‌లేదు. అత్య‌వ‌స‌రంగా అమ‌రావ‌తి (Amaravathi Capital)అంశాన్ని తేల్చ‌డానికి.సుప్రీం సిద్ధంగా లేదు.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 03:42 PM IST

మూడు రాజ‌ధానులు ఇక లేన‌ట్టే! ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న కార్య‌రూపం దాల్చ‌లేదు. సుప్రీం కోర్టు అత్య‌వ‌స‌రంగా అమ‌రావ‌తి (Amaravathi Capital)అంశాన్ని తేల్చ‌డానికి సిద్ధంగా లేదు. కేసును డిసెంబ‌ర్ కు వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన ఆర్డ‌ర్ పై స్టే తెచ్చిన జ‌గ‌న్ స‌ర్కార్ కు చేదు అనుభ‌వం సుప్రీం కోర్టులో మిగిలింది. డిసెంబ‌ర్ వ‌ర‌కు అమ‌రావ‌తి రాజ‌ధాని అంశాన్ని వాయిదా వేసింది. ఆ త‌రువాత ఎన్నిక‌ల‌కు హడావుడి ప్రారంభం అవుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల ఫలితాలు వ‌చ్చే వ‌ర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుకున్న మూడు రాజ‌ధానుల క‌ల నెర‌వేర‌న‌ట్టే.

సుప్రీం కోర్టు అత్య‌వ‌స‌రంగా అమ‌రావ‌తి అంశాన్ని తేల్చ‌డానికి సిద్ధంగా లేదు(Amaravathi Capital)

సీఆర్డీయే ఒప్పందం ప్ర‌కారం ఆరు నెల‌ల్లో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం (Amaravathi Capital)జ‌ర‌గాల‌ని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అంతేకాదు, ఒప్పందం. ప్ర‌కారం రైతుల‌కు ప్లాట్ల‌ను అభివృద్ధి చేసి ఇవ్వాల‌ని చెప్పింది. మూడు రాజ‌ధానుల అంశం లేనందున రాజ‌ధాని అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని సూచించింది. మాస్ట‌ర్ ప్లాన్ ప్ర‌కారం నిర్మాణాలు జ‌ర‌గాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ను ఆదేశించింది. ఆ తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి కొంత ఊర‌ట ల‌భించిన‌ప్ప‌టికీ మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న మాత్రం తెర‌వెన‌క్కు వెళ్లింది.

రెండున్న‌రేళ్ల క్రితం మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కు

రెండున్న‌రేళ్ల క్రితం మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఆ త‌రువాత దానిపై ప‌లు ర‌కాల వాద‌న‌లు వినిపించారు. అధికార వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు.  (Amaravathi Capital) విశాఖ‌, క‌ర్నూలులోనూ రాజ‌ధాని పెట్టాల‌ని అనుకున్నారు. ఆ మేర‌కు బిల్లును అసెంబ్లీలో పాస్ చేశారు. కానీ, మండ‌లిలో ఆ బిల్లు పాస్ కాలేదు. ఆ త‌రువాత కోర్టుల‌కు వెళ్ల‌డం, న్యాయ‌స్థానాలు మొట్టికాయలు వేయ‌డంతో మూడు రాజ‌ధానుల బిల్లును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో మూడు రాజ‌ధానులు అనేది ముగిసిన అధ్యాయంగా మిగిలింది.

అమ‌రావ‌తిని అభివృద్ధి చేయ‌కుండా గేమాడారు.

మూడు రాజ‌ధానుల‌పై స‌మ‌గ్ర బిల్లును తీసుకురావ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. కానీ, హైకోర్టులు రైతులు వేసిన కేసులు ఉన్నాయి. ప‌లు చిక్కుముడులు న్యాయ‌ప‌రంగా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌కు అడ్డుగా ఉన్నాయి. వాటిని తొలగించుకోవ‌డానికి ప‌లు ప్ర‌యత్నాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేశారు. అదే సంద‌ర్భంలో ప్రజా కోర్టులో అమ‌రావ‌తి అంశాన్ని (Amaravathi Capital )నానా యాగీ చేశారు. తొలుత ఒక సామాజిక‌వ‌ర్గం రాజ‌ధాని అంటూ ప్ర‌చారం చేశారు. ఆ త‌రువాత ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ అంటూ ఊద‌ర‌గొట్టారు. అధికార వికేంద్ర‌క‌ర‌ణ అంటూ కొన్ని రోజులు మ‌భ్య‌పెట్టారు. అమ‌రావ‌తిని అభివృద్ధి చేయ‌కుండా గేమాడారు.

Also Read : AP Capital : అమ‌రావ‌తిలో R-5! జై భీమ్, కొల‌క‌ల‌పూడి పోరు!!

రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన రైతులు న్యాయ‌స్థానాల్లో ఫైట్ కొన‌సాగిస్తున్నారు. హైకోర్టులో గెలిచారు. అంతేకాదు, రాజ‌ధాని అమరావ‌తి (Amaravathi Capital )మాత్ర‌మే ఉండాల‌ని న్యాయ‌స్థానం చెప్పింది. గ‌త ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల ప్ర‌కారం రైతుల‌కు న్యాయం చేయాల‌ని సూచించింది. దానికి ఇష్ట‌ప‌డ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ సుప్రీంకు వెళ్లింది. త్వ‌ర‌గా కేసును విచారించాల‌ని కోరింది. కేంద్ర ప్ర‌భుత్వానికి , రైతుల‌కు కూడా నోటీసులు జారీ చేసింది. విచార‌ణ చేయడానికి డిసెంబ‌ర్ వ‌ర‌కు టైమ్ తీసుకోవాల‌ని భావించింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుకుంటోన్న విధంగా విచార‌ణ వేగ‌వంతం అయ్యేలా క‌నిపించ‌డంలేదు. సెప్టెంబ‌ర్లో విశాఖ నుంచి ప‌రిపాల‌న అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న కూడా అమ‌లు అయ్యేలా క‌నిపించ‌డంలేదు.

Also Read : Amaravathi: అమ‌రావ‌తి పై `సుప్రీం` చీఫ్ ల‌లిత్ కీల‌క నిర్ణ‌యం