పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను గెలిపించాలని..అసెంబ్లీ లో అడుగు పెట్టెల చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. గత పది ఏళ్లుగా పార్టీ నడిపిస్తున్నప్పటికీ..ఇంతవరకు అసెంబ్లీ లో అడుగుపెట్టలేదు. 2014 లో టీడీపీ కి సపోర్ట్ చేసి..ఎన్నికల బరిలోకి దిగలేదు. గత ఏడాది ఎలాంటి పొత్తులేకుండా సింగిల్ గా పోటీ చేసి సింగిల్ స్థానానికే పరిమితమయ్యారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్..రెండు చోట్ల ఓటమి చెందారు. ఇక ఈసారి పిఠాపురం బరిలో నిల్చున్నాడు. ప్రస్తుతం సర్వేలన్నీ కూడా పిఠాపురం లో పవన్ గెలుపు ఖాయం అంటున్నాయి. ఇదే క్రమంలో వెండితెర సినీ ప్రముఖులే కాకుండా..బుల్లితెర నటి నటులు సైతం పెద్ద ఎత్తున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తున్నారు. మండు ఎండను సైతం లెక్కచేయకుండా ఇంటింటికి వెళ్తూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే మెగా హీరోలు సైతం పిఠాపురం లో ప్రచారం చేస్తూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం జనసేన కు సపోర్ట్ చేస్తున్నట్లు మెగా అభిమానులు ఓ పిక్ ను షేర్ చేయడం స్టార్ట్ చేసారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఈరోజు సినిమాలోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసారు..పుష్ప రాజ్..పుష్ప రాజ్ అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో సరికొత్త రికార్డు వ్యూస్ రాబడుతుంది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ గాజు గ్లాస్ పట్టుకొని ఉండడంతో ఇన్ డైరెక్ట్ గా బన్నీ జనసేన కు మద్దతు ఇస్తున్నారని చెపుతున్నారు. మరి నిజంగా మేకర్స్ ఆలా ప్లాన్ చేసారా..లేక మాములుగా గ్లాస్ తో డాన్స్ చేయించారో తెలియదు కానీ జనసేన శ్రేణులు మాత్రం అల్లు అర్జున్ జనసేన కోసం ప్రచారం చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
గాజు గ్లాస్ గుర్తుకే
మిడిల్ క్లాస్ ఓటు
pic.twitter.com/44m4ALNN1c— వై.ఎస్.కాంత్ (@yskanth) May 1, 2024
Read Also : Pawan Kalyan : ప్రచారంలో ఆట..పాటలతో హుషారు తెప్పిస్తున్న పవన్ కళ్యాణ్