Site icon HashtagU Telugu

AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయింపు.. !

Allotment of seats to MLAs in AP Assembly.. !

Allotment of seats to MLAs in AP Assembly.. !

AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. ఈ మేరకు సీట్ల కేటాయింపుపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రకటన చేశారు. శాసనసభలో సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. సీట్ విషయంలో ఏదైనా సందేహాలుంటే సిబ్బంది సహకారం తీసుకోవచ్చని ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు. ట్రెజరీ బెంచ్‌గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్ లకు సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆపై సీనియారిటీ ప్రాతిపదికన ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు.

Read Also: TG Inter Exams : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం..

మాజీ సీఎం, వైసీపీ శాసనసభా పక్షనేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష బెంచిలో ముందు వరుస సీట్ కేటాయించారు. సీఎం చంద్రబాబుకు బ్లాక్ 1లోని సీట్ 1ను కేటాయించగా.. డిప్యూటీ సీఎం పవన్‌కు బ్లాక్ 2లో 39 సీట్‌ను నిర్ణయించారు. ఇక వైఎస్ జగన్‌కు బ్లాక్ 11లోని 202ను కేటాయించారు. అంటే స్పీకర్‌కు ఎడమ చేతి వైపు ఎదురుగా జగన్ సీట్ ఉండనుంది. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు గతంలో కూర్చున్న స్థానంలో జగన్‌కు సీట్ కేటాయించారు.

ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించిన సమయంలో సభలోని సీనియర్ సభ్యులు కొందరు ఇప్పటి వరకు సీట్లు కేటాయించకపోవడంపై చర్చించారు.. దీంతో తాజాగా సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 164 సీట్లు రాగా.. వైసీపీకి 11 సీట్లకు పరిమితం అయ్యింది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి తర్వాత అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల సభ్యులకు స్పీకర్‌ సీట్లు కేటాయింపు చేస్తారు. అయితే కూటమి ప్రభుత్వం జూన్ నెలలో అధికారంలోకి రాగా.. తొమ్మిది నెలల తర్వాత సీట్లు కేటాయించారు.

Read Also: R. S. Praveen Kumar : చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ పై ప్రవీణ్ కుమార్ ఫైర్