Minister Kondapalli Srinivas: కూట‌మి మంత్రి.. బొత్స స‌త్య‌నారాయ‌ణ కాళ్లు ప‌ట్టుకున్నారా? నిజ‌మిదే!

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ఎవరో లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు.

Published By: HashtagU Telugu Desk
Minister Kondapalli Srinivas

Minister Kondapalli Srinivas

Minister Kondapalli Srinivas: గత వారం రోజులుగా కూట‌మి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) పై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్‌లో కూర్చున్న బొత్స దగ్గరకు వెళ్లి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆయ‌న కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారంటూ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే వీటిని టీడీపీ కార్య‌క‌ర్త‌లు తిప్పికొట్టారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ ఎవరో లాభాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. విశాఖ ఎయిర్ పోర్టులో తన కాళ్లకు నమస్కరించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆశీర్వాదం తీసుకున్నాడని జరుగుతున్న ప్రచారంలో కుట్ర ఉంద‌ని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సైతం విమ‌ర్శ‌లు చేశారు. మంత్రి కొండపల్లిని మంత్రి పదవి నుంచి తప్పించడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, కొండపల్లిపై కుట్ర జరుగుతుందని బొత్స ఆరోపించారు.

Also Read: Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఆ జిల్లా నుంచే!

ఎయిర్ పోర్టు లాంజ్‌లో తనతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహా కూటమి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారని బొత్స స్ప‌ష్టం చేశారు. మూడు నెలల క్రితం విశాఖ ఎయిర్ పోర్టులో టీడీపీ నాయకులు సహ మంత్రి శ్రీనివాస్, మండలి ప్ర‌తిప‌క్ష‌ నేత బొత్సను క‌లిసిన విష‌యం తెలిసిందే. మంత్రి కొండపల్లి శ్రీనివాసులు పదవి నుంచి తప్పించి వేరొకరికి మంత్రి పదవి ఇవ్వడానికి ఇలాంటి ప్రచారం టీడీపీ ఉన్న వాళ్లే చేస్తున్నారంటూ ప‌లువురు విమర్శలు చేస్తున్నారు. కొండపల్లి శ్రీనివాస్ మంత్రి పదవి చేపట్టిన రోజు నుండి ఉత్తరాంధ్రలో వ్యతిరేక ప్రచారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై జరుగుతున్న ప్రచారం వెనక టీడీపీ వాళ్లే ఉన్నారంటూ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్ర‌స్తుతం దుమారం రేపుతున్నాయి.

  Last Updated: 29 Dec 2024, 10:02 AM IST