Kodali Nani : వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు – కొడాలి నాని

రాష్ట్రంలో వైసీపీ పార్టీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నా

Published By: HashtagU Telugu Desk
Gudivada MLA Kodali is unwell

Gudivada MLA Kodali is unwell

ఎన్నికల కౌంటింగ్ అనంతరం వైసీపీ నేతలు, కార్య కర్తలపై కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నా. ఇందులో భాగంగా గ్రామాల్లో అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా దాడులు నిలువరించకుండా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులకు సమాచారం అందించినా స్పందించడం లేదని వాపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇళ్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారు.. గుడివాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతలను, క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరుగుతున్నాయని.. ఈ దాడులకు పోలీసులు దగ్గర ఉండి చేయిస్తున్నారని విమర్శించారు. దాడులు జరుగుతుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.. టీడీపీ అల్లరి మూకల మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టులో కేసులు వేస్తామని పేర్కొన్నారు.

అలాగే మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. టీడీపీ నేతలు, డీజీపీ కేసులు పెట్టవద్దని పోలీసులకి ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. యూపీ, బీహార్ మాదిరి హింసా రాష్ట్రంగా టీడీపీ మారుస్తోంది.. అరాచక మూకలను ఆపాల్సిన పోలీసులు బెదిరిస్తున్నారు అని తెలిపాడు.

Read Also : Leader of Opposition : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. సీడబ్ల్యూసీ తీర్మానం

  Last Updated: 08 Jun 2024, 03:59 PM IST