Site icon HashtagU Telugu

RK Roja : కూటమి నాయకులు టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారు – రోజా

Roja Tirupathi

Roja Tirupathi

కూటమి నాయకులు (NDA Leaders) టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు వైసీపీ మాజీ మంత్రి రోజా (Roja). ఏపీలో మహిళలపై , చిన్నారుల పై జరుగుతున్న దాడులపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. తాజాగా తిరుపతిలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. మూడేళ్ళ చిన్నారి పై అత్యాచారం ఆపై హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గత ప్రభుత్వలోనే అనుకుంటే..ఈ ప్రభుత్వంలో కూడా మహిళలకు , చిన్న పిల్లలకు రక్షణ అనేది లేకుండా పోతుందని తల్లిదండ్రులు వాపోతుండగా..ప్రతి రోజు ఈ తరహా ఘటనలు ప్రభుత్వాన్ని మరింత విమర్శల పాలుచేస్తుంది.

ఇప్పుడు తిరుపతి లో జరిగిన ఘటనపై వైసీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనపై మాజీ మంత్రి రోజా స్పందించారు. కూటమి ప్రభుత్వం నాయకులు టైం పాస్ పాలిటిక్స్ చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత ఎందుకు స్పందించడం లేదని రోజా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక 100 మందికి పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని రోజా విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ వెళ్లి అన్‌స్టాపబుల్ షోలో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రభుత్వ చేతగాని తనం వల్లే ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారని మండిపడ్డారు. మద్యం షాపుల పెంపుదల, గంజాయి వాడకం పెరగడం వల్లే మహిళలపై, చిన్నారులపై దాడులు పెరుగుతున్నాయన్నారు.

మరోపక్క ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం అనకాపల్లి జిల్లాలోని వెన్నెలపాలెంలో పర్యటించిన బాబు.. ఈ సందర్భంగా ప్రసంగంలో చిన్న పిల్లలపై జరిగిన అమానవీయ ఘటనలను తీవ్రంగా ఖండించారు. చిన్నారులను కూడా వదలకుండా దాడులు జరుపుతున్న వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇలాంటి అమానవీయ చర్యలను అడ్డుకోవాలంటే నడిరోడ్డుమీదనే ఉరితీయడం అవసరం” అని పేర్కొన్నారు. గంజాయి, మద్యం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని , ఇప్పటికే హెచ్చరించాం. మరోసారి ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also : Karthika Masam : మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్