Ration Card EKYC : ఏపీలో ప్రభుత్వం మరోసారి రేషన్ కార్డులు ఈకేవైసీ గడువును పొడగిచింది. వాస్తవంగా మార్చి 31తోనే గడువు ముగియనుంది. అయినా ఇంకా చాలా మంది ఇంకా ఈకేవైసీ చేసుకోవడం లేదు. అందుకే ఈ గడువును మరో నెల రోజుల పాటు ప్రభుత్వం పెంచింది. ఆ లోపు ఈకేవాసీ చేసుకోవాలని పౌరుసరఫరాల శాఖ అధికారులు సూచించారు. మరోసారి పెంపుదల ఉండదని చెబుతున్నారు. ఏప్రిల్ 30 లోపు ఈకేవైసీ చేసుకోని కార్డులను తొలగిస్తామని వాళ్లకు రేషన్ అందబోదని స్పష్టం చేశారు.
Read Also: CM Revanth : తెలంగాణ మహిళలకు వరాలు అందించబోతున్న సీఎం రేవంత్
మార్చి 31 వరకు ఈకేవైసీ పూర్తి చేసి ఏప్రిల్‌లో స్క్రూట్నీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇంకా లక్షల్లో ఈకేవైసీ చేసుకోని వాళ్లు ఉన్నారు. దీని వల్ల అర్హత లేని వాళ్లకు కార్డులు తీసివేయడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని యోచించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్తరేషన్ కార్డులు జారీ చేయనుంది. మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించనుంది. ఈ లోపు ఉన్న కార్డుల్లో ఎన్ని అర్హమైనవి ఎన్ని ఫేక్ కార్డులో లెక్కలు తేల్చేందుకు సిద్ధమైంది. అందుకే కార్డు హోల్డర్లు అందరూ ఈకేవైసీ చేసుకోవాలని ప్రజలకు సూచించింది.
గడువు ముగుస్తుందని చెప్పడంతో ఆఖరి నిమిషంలో ఎక్కువ మంది ఈకేవైసీ కోసం ఎగబడుతున్నారు. దీంతో సర్వర్ సమస్యలు వస్తున్నాయి. రేషన్ డీలర్ల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నారు. అందుకే ప్రభుత్వం గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పెంచింది. ఈ ఈకేవైసీ ప్రక్రియను డీలర్ల ద్వారా చేపడుతున్నారు. రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉన్నా సరే సమీపంలోని డీలర్ వద్దకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవచ్చు.
Read Also: DSC Notification : 10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ – మంత్రి లోకేష్