Group-2: రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు రాయనున్న అభ్యర్థులను ఏపీపీఎస్సీ అలర్ట్ చేసింది. మరోసారి పోస్ట్, జోనల్ ప్రిఫరెన్స్ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. పరీక్షల అనంతరం అర్హత సాధించిన అభ్యర్థులు ఫైనల్ సెలక్షన్ కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలోనూ కచ్చితంగా మరోసారి పోస్ట్, జోనల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి 92,250మంది మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Read Also: Man With 5 Kidneys: ఈయన శరీరంలో ఐదు కిడ్నీలు.. ఎవరు ? ఎలా ?
కాగా, రాష్ట్రంలో ఏపీపీఎస్సీ 2023వ సంవత్సరంలో డిసెంబర్ 7వ తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2024, ఫిబ్రవరి 25వ తేదీన ఈ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడిన అనంతరం మెయిన్స్ పరీక్షలు పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల (ఫిబ్రవరి) 23వ తేదీన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ ఎల్లుండి (ఆదివారం) ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్ లైన్‌లో నిర్వహించనున్నారు.
Read Also: CM Revanth Reddy : గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం..చర్చకు సిద్ధమా?: సీఎం రేవంత్‌రెడ్డి