Site icon HashtagU Telugu

Akshara Andhra : 100 శాతం అక్షరాస్యత కోసం ‘అక్షర ఆంధ్ర’ – నారా లోకేష్

Nara Lokesh Raises New Doub

Nara Lokesh Raises New Doub

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వారిలో సుమారు 81 లక్షల మంది ఇప్పటికీ అక్షరాస్యత లేని వారిగా ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో “అక్షర ఆంధ్ర” (Akshara Andhra) పేరిట అక్షరాస్యత ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. వయోజన విద్యా విభాగంలో ఖాళీగా ఉన్న 109 పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలోని అంకితభావం గల సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా నియమించేందుకు సూచించారు.

Akhil Akkineni Marries Zainab: అఖిల్ అక్కినేని వివాహం.. ఎక్స్‌లో ఫొటోలు పంచుకున్న నాగార్జున‌!

అలాగే నిరుద్యోగ యువతకు మంత్రి లోకేశ్ (Nara Lokesh) గుడ్ న్యూస్ తెలిపారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏడేళ్ల విరామం తర్వాత మొదలైన మెగా డీఎస్సీ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈసారి మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, 5.77 లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. అంటే ఒక్కో పోస్టుకు సగటున 35 మంది పోటీలో ఉన్నారు. జూన్ 6 నుండి జూలై 6 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 150 సెంటర్లలో CBT విధానంలో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

G7 Summit : కెనడా ఆతిథ్యమిస్తున్న 51వ జీ7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం: ప్రధాని మోడీ

అక్షర ఆంధ్ర కార్యక్రమంతో పాటు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా జరిగాయని మంత్రి తెలిపారు. మొత్తం 4 వేల మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించామని వెల్లడించారు. అక్షరాస్యతను పెంచడమే కాదు, నాణ్యమైన విద్యను అందించడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. “అక్షర ఆంధ్ర” ఉద్యమం రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని, ఇది సామాజిక సమానత్వానికి దోహదం చేస్తుందని మంత్రి నారా లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు.