Air India Express : విశాఖ టు విజయవాడ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ప్రారంభం

ఈ విమాన సర్వీసు తిరిగి రోజూ రాత్రి 7:55 గంటలకు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నానికి(Air India Express) చేరుకుంటుంది. 

Published By: HashtagU Telugu Desk
Air India Express Visakhapatnam Andhra Pradesh

Air India Express : ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వీటిని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. విశాఖపట్నం – విజయవాడ నగరాల మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడవనున్నాయి.

Also Read :Medaram Jathara : మేడారం మినీ జాతర తేదీలు ఖరారు

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు రోజూ ఉదయం 9:35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10:35  గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ విమాన సర్వీసు తిరిగి రోజూ రాత్రి 7:55 గంటలకు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నానికి(Air India Express) చేరుకుంటుంది. కొత్తగా ప్రారంభించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌‌లో 180 మంది ప్రయాణించవచ్చు. ఇది బోయింగ్‌ 737 మోడల్ విమానం. కాగా, ఇప్పటికే వైజాగ్‌-విజయవాడ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఒక విమానాన్ని నడుపుతోంది. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ ఉండటంతో  ఈరోజు నుంచి రెండో విమాన సర్వీసును కూడా ఇండిగో ప్రారంభించింది.

Also Read :Milk With Dry Fruits : అత్తిపండ్లు లేదా ఖర్జూరం, ఏది పాలలో కలిపి తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?

మరో ఏడు విమానాశ్రయాలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు విమానాశ్రయాలను నిర్మించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. నెల్లూరు జిల్లాలోని దగదర్తి, చిత్తూరు జిల్లాలోని కుప్పం, గుంటూరు సరిహద్దులోని నాగార్జునసాగర్ సహా పలుచోట్ల కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటికి కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆమోదం లభించగానే పనులు ప్రారంభమవుతాయి.

సముద్ర తీరంలో చేప ఆకారంలో..

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2026 జనవరి నాటికి తొలి విమానం రన్‌వేపై దిగాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ పనులను 2026 జూన్ నాటికి పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది.సముద్ర తీరంలో చేప ఆకారంలో భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నారు. ఈ విమానాశ్రయంలో 3.8 కి.మీ. పొడవునా రెండు రన్‌వేలు, టెర్మినల్‌ టవర్, ఎయిర్‌ఫీల్డ్‌‌ ఉంటాయి.

Also Read :Diwali 2024 : దీపావళి రోజున మీ ఇంటిని ఇలా అద్దాలను ప్రకాశింపజేయండి..!

  Last Updated: 27 Oct 2024, 09:47 AM IST