Government Hospitals ఏపీ ప్రభుత్వం ఏఐ సాయంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 18 ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 40 పరికరాల ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద సరికొత్త ఆవిష్కరణల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్క్రీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారు. ఈ మేరకు తక్కువ సమయంలో వ్యాధులు ఖరారు చేయడం, అత్యుత్తమ వైద్యం అందిచొచ్చని చెబుతున్నారు అధికారులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 స్టార్టప్ సంస్థలతో కలిసి వైద్య పరీక్షలు, ఇతర సేవల్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఐ సేవలతో అతి తక్కువ సమయంలో వ్యాధి నిర్ధారణ, రోగులకు చికిత్స అందించే సమయం కూడా ఆదా అవుతుందంటున్నారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రులు.. పార్వతీపురం, రాజానగరం, సిద్థార్థ మెడికల్ కాలేజీ, సత్తెనపల్లి ప్రాంతీయ ఆసుపత్రి, తెనాలిలోని జిల్లా ఆస్పత్రి, ఇతర చోట్ల పైలట్ ప్రాజెక్టు విధానంలో ఈ సేవల్ని ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వీటి ఫలితాలను విశ్లేషించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదక ఇస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
వ్యాధుల్ని ప్రాథమిక పరీక్షలతో గుర్తించి.. తక్కువ సమయంలో మెరుగైన వైద్యసేవలు అందించొచ్చు. డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంభాషణ రికార్డు చేస్తారు ఏఐ అప్లికేషన్ల సాయంతో పరీక్షలు చేసి ప్రాథమిక దశలోనే సమస్యల్ని గుర్తిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో క్యాన్సర్ గుర్తింపు, క్షయను గుర్తించడానికి, షుగర్, కిడ్నీ, థైరాయిడ్, రక్తపరీక్షలు కూడా ఏఐ ఆధారిత పరికరాలతో చేస్తున్నారు. గుండె సమస్యలు, ఐసీయూలో ఉన్నవారికి బీపీ, పల్స్, టెంపరేచర్, ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణ లాంటి మరికొన్ని చోట్లో అందుబాటులో ఉన్నాయి. ఏఐ సాయంతో ఏపీ ప్రభుత్వం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో ఎంపి క చేసిన 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకేసారి 40 పరికరాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు.
విశాఖపట్నంలో ‘పింక్ సఖి శారీ వాక్’ నిర్వహించారు.. క్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వాక్‌ను రాహుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు బీచ్ రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వాక్‌కు సినీ నటి, లైఫ్ ఎగైన్ సంస్థ వ్యవస్థాపకురాలు గౌతమి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఈ అవగాహన ర్యాలీలో నగరానికి చెందిన మహిళలు భారీగా పాల్గొన్నారు.
