గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో హల్చల్ చేసిన మహిళా అఘోరి (Naga Sadhu)..ఇప్పుడు తన మకాంను ఏపీకి మార్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ లో ప్రముఖ ఆలయాల్లో నగ్నంగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. డేంజర్…అఘోరీ…నాగసాదు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్న కారులో తిరుగుతూ హల్ చల్ చేసింది. ఇదే క్రమంలో పలు మీడియా చానెల్స్ కు వరుస ఇంటర్వ్యూ ఇచ్చి మరింత పాపులర్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈమె ఏపీలో తిరుగుతూ కనిపిస్తుంది. శ్రీశైలం, వైజాగ్ వంటి ప్రదేశాల్లో కనిపించిన ఈమె..తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan) అడ్డా పిఠాపురం (Pithapuram)లో ప్రత్యేక్షమయ్యింది. పాదగయ క్షేత్రానికి అఘోరి నగ్నంగా వచ్చింది. పాదగయలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి పురోహుతికా అమ్మవార్లకు అఘోరి పూజలు చేసింది. మూడు రోజుల క్రితం ఏపీకి వస్తూ..అనకాపల్లి సమీపంలో ఉన్న నక్కపల్లి టోల్ గేట్(Nakkapally Toll Gate) సిబ్బందితో గొడవకు దిగింది. టోల్ గేట్ సిబ్బంది తన శరీరాన్ని తాకడమే కాకుండా.. సారీ చెప్పారని. ఇలాంటి వారే.. మహిళలు, పిల్లలు అని తేడా లేకుండా అత్యాచారాలు చేసి.. సారీ చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నాగసాధువు అయిన తనకు రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్లే కలియుగం ఇలా మారిపోయిందని, తాను సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం( ready to sacrificelife)గా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also : Allu Arjun Quash Petition: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్!