YS Jagan : గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనుసరించిన కాన్వాయ్‌లో విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం మేరకు, జగన్ ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించేందుకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు.
జగన్ పర్యటన నేపథ్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించిన వైసీపీ కార్యకర్తలు ప్రాంతంలో హడావుడి సృష్టించారు. ఈ క్రమంలో, నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడిని కాన్వాయ్‌లోని వాహనాల్లో ఒకటి ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో వృద్ధుడు నేలకూలాడు. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
తర్వాతి క్షణాల్లో అక్కడికి చేరుకున్న మెడికల్ సిబ్బంది వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతుండగానే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన తర్వాత కూడా కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు