AP Cabinet Meeting Highlights : దసరా నుంచి విశాఖ నుంచే పాలన – సీఎం జగన్

విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని మంత్రిమండ‌లి స‌మావేశంలో సీఎం జగన్ వెల్ల‌డించారు. అప్ప‌టి వ‌ర‌కు కార్యాల‌యాల‌ను త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు

Published By: HashtagU Telugu Desk
AP Cabinet Meeting Highlights

Dasar

ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting )లో సీఎం జగన్ (CM Jagan) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని (Administration to Start in Visakhapatnam From Dasara) మంత్రిమండ‌లి స‌మావేశంలో సీఎం జగన్ వెల్ల‌డించారు. అప్ప‌టి వ‌ర‌కు కార్యాల‌యాల‌ను త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు.

Read Also : Jagan Govt Good News : ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ వరాల జల్లు..

సీఎం అధ్యక్షతన బుధువారం కేబినెట్‌ సమావేశం (AP Cabinet Meeting ) జరిగింది. ఈ సమావేశంలో ప‌లు కీల‌క బిల్లుల‌కు ఆమోద ముద్ర వేశారు. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ముసాయిదా బిల్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లులకు మంత్రిమండ‌లి ఆమోదించింది. ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలి. ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రిటైర్డ్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలి. వారి పిల్లల చదువులు కూడా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కింద ఉండి ప్రయోజనాలు అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు.

ఇక ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలు (AP Cabinet Meeting Highlights) చూస్తే..

  • ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం.
  • కురుపాం ఇంజినీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
  • పోలవరం ముంపు బాధితులకు 8,424 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్న‌ల్‌.
  • జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి కేబినెట్‌ ఆమోదం.
  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం.
  • భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.
  • దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.
  • ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం.
  • అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు మంత్రిమండ‌లి ఆమోదం.
  Last Updated: 20 Sep 2023, 03:37 PM IST