Adani Meets CM Jagan : సీఎం జగన్ తో అదానీ భేటీ..

అదానీ గ్రూప్‌కు ఏపీ చాలా కీలకమైన రాష్ట్రం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో రెండు పోర్టులతో పాటు పవర్ ప్లాంట్లు, అదానీ విల్మార్ వంట నూనెల పరిశ్రమలు ఉన్నాయి

Published By: HashtagU Telugu Desk
Adani Meets Cm Jagan

Adani Meets Cm Jagan

ఏపీ సీఎం జగన్ (CM Jagan) తో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Adani ) భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అదానీ.. నేరుగా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. గతంలోనూ పలుమార్లు అదానీ..సీఎం జగన్ ను కలిశారు. ఏపీలో అదానీ గ్రూపు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. కృష్ణపట్నం, గంగవరం పోర్టులతో పాటు పలు ప్రాజెక్టుల్ని అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. అలాగే వైజాగ్ లో మెగా డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు కూడా అదానీ గ్రూప్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే వైజాగ్ లో ఈ ఏడాది నిర్వహించిన పెట్టుబడుదల సదస్సు కూడా హాజరైన అదానీ గ్రూప్ ప్రతినిధులు.. పలు ప్రతిపాదనలు ఇచ్చారు. వీటిపై చర్చించి ఖరారు చేసేందుకు గౌతం అదానీ ఈరోజు సీఎం జగన్ తో భేటీఅయినట్లు తెలుస్తుంది.

అదానీ గ్రూప్‌కు ఏపీ చాలా కీలకమైన రాష్ట్రం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో రెండు పోర్టులతో పాటు పవర్ ప్లాంట్లు, అదానీ విల్మార్ వంట నూనెల పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నేపధ్యంలో అదానీ గ్రూప్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సీఎం జగన్- అదానీ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అదానీ గ్రూప్ తీసుకునే నిర్ణయం ఏపీకి తీపి కబురు గా మారనుంది.

Read Also : Big Shock to BRS Party : ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న బిఆర్ఎస్ కీలక నేతలు

  Last Updated: 28 Sep 2023, 09:25 PM IST