Celebrities In Bhogi : ఇవాళ తెల్లవారుజామున భోగి వేడుకల్లో పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో సినీ నటుడు సాయికుమార్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా సాయి కుమార్ మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను వెల్లడించారు. తనకు ఈ సంక్రాంతి చాలా స్పెషల్ అని చెప్పారు. 1975 సంవత్సరం జనవరిలో తన తొలి సినిమా రిలీజ్ అయిందని సాయికుమార్ చెప్పారు. తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు గడిచాయన్నారు. అందుకే ఈ సంక్రాంతిని తాను స్పెషల్‌గా చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భోగి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్, హీరో సాయి ధరం తేజ్ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. మరికొందరు ప్రముఖ నటులు కూడా ఎక్స్ వేదికగా భోగి పండుగ విషెస్ చెప్పారు.
Also Read :Bus Conductor Vs Retired IAS : రిటైర్డ్ ఐఏఎస్‌పై బస్సు కండక్టర్ దాడి.. రూ.10 టికెట్ వల్లే!
తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో జరిగిన భోగి వేడుకల్లో నటుడు మోహన్ బాబు(Celebrities In Bhogi) కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. సంప్రదాయాలకు, విలువలకు ప్రతీక సంక్రాంతి అని చెప్పారు. రైతు సుభిక్షంగా ఉంటేనే సంక్రాంతి వేడుకగా జరుపుకుంటామని తెలిపారు.
Also Read :CM Revanth Style: సీఎం రేవంత్ డ్రెస్సింగ్ స్టైల్‌లో ట్రెండ్ సెట్టరే!
మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. భక్త కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తామని ప్రకటించారు. జల్లికట్టుకు రంగంపేట ఫేమస్.. అందుకే యువత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రతి రోజు బాగుండాలని భగవంతుడిని కోరుకుంటాం. అందరూ బాగుండాలి. సంక్రాంతి అంటేనే రైతు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇలాంటి పండగలను ఆనందంగా జరుపుకోవచ్చు. సినిమా మిత్రులకు వారు తీసిన సినిమా హిట్ అయితేనే నిజమైన పండగ. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, కరవు కాటకాలు రాకూడదని, రైతు బాగుండాలని కోరుకుంటున్నా. జాగ్రత్తగా పండగ చేసుకోండి’’ అంటూ మంచు విష్ణు సంక్రాంతి విషెస్ చెప్పారు.