Raja Joined in Congress : ఏపీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సినీ నటుడు రాజా..

వెన్నెల, ఆనందం.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన రాజా ఆ తర్వాత క్రిస్టియన్ పాస్టర్ గా మారారు. అప్పట్నుంచి క్రిస్టియన్ మత ప్రచారాలు చేసుకుంటున్న రాజా తాజాగా నేడు ఏపీ కాంగ్రెస్ లో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సమక్షంలో చేరాడు.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 08:00 PM IST

ఏపీలో ఓ పక్క టీడీపీ(TDP), జనసేన(Janasena) మరో పక్క వైసీపీ(YCP) మధ్య రాజకీయం నడుస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రస్తుతం ఏపీలో ఈ పార్టీలోనే చేరే పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏపీలో రాష్ట్ర విభజన చేసినప్పుడే కాంగ్రెస్(Congress) అడ్రెస్ గల్లంతు లేకుండా పోయింది. అసలు ఏపీ కాంగ్రెస్ లో ఎలాంటి చేరికలు లేవు. తాజాగా ఏపీ కాంగ్రెస్ లో మాజీ సినీ నటుడు రాజా(Raja) చేరడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఒకప్పుడు వెన్నెల, ఆనందం.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన రాజా ఆ తర్వాత క్రిస్టియన్ పాస్టర్ గా మారారు. అప్పట్నుంచి క్రిస్టియన్ మత ప్రచారాలు చేసుకుంటున్న రాజా తాజాగా నేడు ఏపీ కాంగ్రెస్ లో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సమక్షంలో చేరాడు.

రాజా చేరికపై గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. అతి పిన్న వయసులోనే సినిమా ప్రపంచాన్ని వీడి ప్రజాసేక చేయాలని ప్రజాక్షేత్రంలోకి రాజా వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి పార్టీలో చేరడం సంతోషం అని అన్నారు. రుద్రరాజు పార్టీ కండువా కప్పి రాజాని పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక రాజా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి నేను ముందు నుంచి అభిమానిని. సినిమాలు, ఆ తర్వాత ఆధ్యాత్మిక జీవితంతో కొంతకాలం పార్టీకి దూరం అయ్యాను. మణిపూర్ అల్లర్ల సమయంలో రాహుల్ గాంధీ స్పందించిన తీరు నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అందుకే ఆయన స్పూర్తితో పార్టీలో చేరాను అని తెలిపారు. అయితే ఏపీలో అసలు పోటీచేస్తే డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ లో రాజా చేరడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మరి రాబోయే ఎన్నికల్లోరాజా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడేమో చూడాలి.

 

Also Read : Ayyanna Patrudu : లోకేష్ ని అరెస్ట్ చేస్తే బ్రాహ్మణిని ముందు పెట్టి పార్టీ నడిపిస్తాం.. అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు..