జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు చిత్రపరిశ్రమ నుండి మద్దతు పెరిగిపోతుంది. కొంతమంది నేరుగా ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరుతుండగా..మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఏపీలో మరో నాల్గు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలఫై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా పిఠాపురంలో గెలుపు ఎవరిదీ అని అంత మాట్లాడుకుంటున్నారు. వైసీపీ నుండి వంగా గీత బరిలోకి దిగితే..కూటమి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందిన పవన్ కళ్యాణ్..ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. దాదాపు 80 % కాపు సామాజికవర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ఇప్పటికే అంత ఫిక్స్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
అనేక సర్వేలు సైతం లక్ష్యం మెజార్టీ తో పవన్ కళ్యాణ్ గెలుపొందుతున్నారని చెపుతున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటాం..అసెంబ్లీకి పంపిస్తాం అని అభిమానులు , జనసేన శ్రేణులు చెపుతున్నారు. అయినప్పటికీ తమ వంతుగా మెగా ఫ్యామిలీ తో పాటు చిత్రసీమ ప్రముఖులు ప్రతి ఇంటిగడపకు వెళ్లి గాజు గ్లాస్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. హైపర్ ఆది , గెటప్ శ్రీను , సుడిగాలి సుధీర్, నిర్మాత నాగవంశీ, నటులు సప్తగిరి , షకలక శంకర్ లతో పాటు పలువురు బుల్లితెర నటి నటులు ప్రచారం చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్ , సాయి తేజ్ , వైష్ణవ్ తేజ్ లు ప్రచారం చేయగా.. అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు సైతం పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరారు.
ఇక ఇప్పుడు సీనియర్ నటుడు నరేష్ (Actor Naresh) సైతం సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ‘ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటైన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను స్థిరమైన మద్దతుదారునిగా కొనసాగుతున్నా. మీ ప్రయాణం ఓ ఆశాద్వీపం. మీ మిషన్ కు మద్దతుగా నిలుస్తాం. మీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్’ అంటూ పవన్ కళ్యాణ్ కు తన మద్దతును తెలిపారు.
Read Also : Chandrababu : చంద్రబాబుకు మద్దతు తెలిపిన ముస్లిం లా బోర్డు