Site icon HashtagU Telugu

Jagan : పులివెందుల్లో జగన్ కు షాక్ ఇచ్చిన కార్యకర్తలు

Jagan Puli

Jagan Puli

ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత శనివారం జగన్ (Jagan) తన సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకున్నారు. గన్నవరం నుంచి విమానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు కడప విమానాశ్రయానికి చేరుకున్న ఆయన…అక్కడి నుండి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరారు. పులివెందుల క్యాంపు కార్యాలయం చేరుకున్న జగన్​కు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేసుకుంటూ వాహనంపైనే నమస్కరించుకుంటూ క్యాంపు కార్యాలయంలోకి వెళ్లారు. పులివెందుల క్యాంపు కార్యాలయానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు పలువురు ముఖ్య నేతలు వచ్చి జగన్​ను కలిశారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే సీఎంను చూసేందుకు పెద్ద ఎత్తున నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు విచ్చేశారు. అయితే.. జగన్‌ను కలవడానికి చాలా మంది కార్యకర్తలు ప్రయత్నించగా వ్యక్తిగత సిబ్బంది, సెక్యూరిటీ అడ్డుకుంది. దీంతో ఓటేసి గెలిపించిన మమ్మల్నే జగన్ కలవకపోవడం ఏంటి..? సెక్యూరిటీ ఎందుకిలా తోసేస్తోంది..? అంటూ ఆగ్రహంతో కార్యకర్తలు రగిలిపోయారు. జగన్ డౌన్.. డౌన్ అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు సైతం చేయడం గమనార్హం. ఎక్కడ్నుంచో వచ్చిన తమను జగన్‌ను చూడటానికి, కనీసం ఇంట్లోకి పంపకుండా సిబ్బంది అడ్డుకున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఈ ఘటనతో జగన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణమే నెలకొంది.

Read Also : Home Minister Vangalapudi Anitha : హోంమంత్రి అనిత పర్యటనలో అపశృతి