Chandrababu Bail Petition : మరోసారి చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

ఈ కేసు దర్యాఫ్తు కీలక దశలో ఉందని, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని పొన్నవోలు కోర్టును కోరారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు

Published By: HashtagU Telugu Desk
Acb Court Adjourned Hearing

Acb Court Adjourned Hearing

చంద్రబాబు బెయిల్ (Chandrababu Bail ) ఫై ఉత్కంఠ అలాగే కొనసాగుతూనే ఉంది. రోజులు గడుస్తున్నా బాబు మాత్రం బయటకు రావడం లేదు. రెండు రోజుల్లో బాబు బయటకు వస్తాడని అంత భావిస్తే..ఇప్పుడు నెల రోజులు కావొస్తున్నా ఇంకా బయటకు రాలేదు. చంద్రబాబు ను బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లను తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్న..కోర్ట్ లు మాత్రం వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఈరోజు సైతం చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ( Chandrababu Bail Petition), సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు (ACB Court ) రేపటికి (గురువారం) వాయిదా వేసింది. రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ఈ పిటిషన్లను విచారించనుంది.

ప్రభుత్వ తరపు , చంద్రబాబు తరుపు..ఇలా ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి (అక్టోబర్‌ 5కు) వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపించారు. చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని, కస్టడీకి అనుమతించాలంటూ ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ విదేశాలకు పరారయ్యారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాళ్లిద్దరూ ఐటీ దర్యాప్తులో ఉన్నవాళ్లేనా? అని ఏఏజీని కోర్టు ప్రశ్నించింది. స్కిల్‌ కేసులో చంద్రబాబుతో ఆర్థిక లావాదేవీలు జరపటంతోనే వాళ్లిద్దరూ విదేశాలకు వెళ్లారని పొన్నవోలు తెలిపారు. వాంగ్మూలం ఇచ్చిన పీవీ రమేష్ మాట మార్చారని.. మీడియాలో వేరే విధంగా చెబుతున్నారన్నారు. అయితే, పెండ్యాల శ్రీనివాస్‌, వాసుదేవ్‌ విదేశాలకెళ్తే చంద్రబాబుకు ఏంటీ సంబంధం? అని సుప్రీంకోర్టు న్యాయవాది దూబే వాదనలు వినిపించారు. వారు విదేశాలకెళ్తే చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వొద్దనడం సబబేనా? అని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కేసు దర్యాఫ్తు కీలక దశలో ఉందని, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని పొన్నవోలు కోర్టును కోరారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. ఈ కేసుకు సంబంధించి రూ.371 కోట్ల దుర్వినియోగం జరిగిందన్నారు. డొల్ల కంపెనీలతో దోచుకున్నారన్నారు. 2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించిందని, సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరిందని తెలిపారు.

కేసు కేంద్ర దర్యాఫ్తు సంస్థల విచారణలో ఉన్న సమయంలోనే 2018లో 17ఏ సవరణ జరిగిందని, ఈ క్రమంలో 17ఏ చంద్రబాబుకు వర్తించదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆధారాలను కోర్టు ముందు ఉంచామని, పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ జరిగిందని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

Read Also : Jagan Delhi Tour : రేపే ఢిల్లీకి జగన్..సడెన్ గా షెడ్యూల్ చేంజ్

  Last Updated: 04 Oct 2023, 06:59 PM IST