Pawan Kalyan: పవన్ యాత్రకు ప్రత్యేక వాహనం..బస్సును చూస్తే వాహ్ అనాల్సిందే..!!

ఏపీలో జరిగే ఎలక్షన్స్ పై క్లారిటీ వచ్చేసింది. అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Pawan

Pawan

ఏపీలో జరిగే ఎలక్షన్స్ పై క్లారిటీ వచ్చేసింది. అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇందులో ముందుగానే పవన్ బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. తన బస్సు యాత్రకు సంబంధించి ప్రత్యేక బస్సు రెడీ అవుతోంది. అయితే ఈ బస్సుకు ఎన్నో ప్రత్యేకలున్నాయి. జనంలోకి వెళ్లేందుకు జనసేనాని చేపట్టబోయే బస్సు యాత్ర మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం అవుతుంది. ఈ యాత్రలో పవన్ వినియోగించే బస్సును ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న ఈ వాహనాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు. యాత్రకు అవసరమైన కొన్ని మార్పులు,సూచనలు కూడా చేశారు. ముందుగా ఈ వాహానాన్ని పుణెలో తయారుచేద్దామని భావించినప్పటికీ…పవన్ సూచనలతో హైదరాబాద్ లోనే రెడీ చేస్తున్నారు. పవన్ సూచనల ప్రకారమే ప్రచార రథం సిద్ధమవుతుందని పార్టీ క్యాడెర్ అంటోంది. సినిమా క్యారీ వ్యాన్ లా కాకుండా…పూర్తిగా పొలిటికల్ మోడల్ తో ఈ వాహనం తయారు అవతుందని చెబుతున్నారు.

ఇక ఈ బస్సు ప్రత్యేకతలు చెప్పుకుంటే…కనీసం 6గురు కూర్చునే విధంగా కన్వెట్టబుల్ సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో…నిఘా నేత్రం మధ్య ఈ వాహనం ఉంటుంది. బస్సుకు చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. ఇక ఈ బస్సుకు మిలటరీ రంగును వాడుతున్నారు. అచ్చం మిలటరీ వెహికల్స్ లాగే ఉండనుంది. తుది మెరుగులు దిద్దాక…పవన్ నేరుగా టాప్ మీదకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

  Last Updated: 14 Oct 2022, 05:51 AM IST