Major Accident: సీఎం చంద్రబాబుకు తప్పిన పెనుప్రమాదం

చంద్రబాబుకు అతీ సమీపంగా రైలు వచ్చింది. రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండటంతో ప్రమాదం తప్పింది. అయితే సీఎంకు రైలు దాదాపు మూడు అడుగుల దూరంలో వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Chandrababu Missed A Big Risk

Chandrababu Missed A Big Risk

Major Accident: విజ‌య‌వాడ‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu)కు పెను ప్ర‌మాదం (Major Accident) త‌ప్పింది. మధురానగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు రైలు (Train) వంతెన పైకి కాలినడకన (By Walk) వెళ్లారు. అదే సమయంలో ఎదురుగా రైలు వచ్చింది. చంద్రబాబుకు అతీ సమీపంగా రైలు వచ్చింది.

 రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండటంతో ప్రమాదం తప్పింది. అయితే సీఎంకు రైలు దాదాపు మూడు అడుగుల దూరంలో వెళ్లింది. రైలును గ‌మ‌నించిన సెక్యూరిటీ సిబ్బంది అల‌ర్ట్ అయ్యి.. చంద్ర‌బాబుకు ఎలాంటి గాయం కాకుండా కాపాడారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Also Read: BIG Move On Agnipath : అగ్నివీరులకు గుడ్ న్యూస్.. అగ్నిపథ్ స్కీంలో కీలక సవరణలు!

  Last Updated: 05 Sep 2024, 05:13 PM IST