Site icon HashtagU Telugu

Investment in AP: పెట్టుబడుల గుట్టు! విశాఖ సదస్సు రహస్యం!!

Second Day of Vizag Global Investors Summit

A Lot Of Investment! Visakha Conference Secret!!

భారత్ బయోటెక్ క్రిష్ణ, రాజ్యసభ ఇచ్చి రిలయన్స్, జగన్ కేసుల్లో వున్న దాల్మియాతో ఇక రెడ్డి సామాజిక వర్గం పారిశ్రామిక వేత్తలు మోహన్ రెడ్డి, ప్రీతి రెడ్డి, హెటెరో రెడ్డి, అరబిందో రెడ్డి, సతిష్ రెడ్డి తదితరులు వేదికపై కనిపించారు. మొత్తం 13 లక్షల కోట్లు ఒప్పందాలను కనీసం లక్ష కోట్లు అయినా ఉంటాయని సాధారణంగా అనుకుంటారు. అదే జగన్ సర్కారుకు అవసరం. గత చరిత్రను తీసుకుంటే 13 లక్షలు కాదు .. 13 వేల కోట్లు రావటం కూడా కష్టమని పారిశ్రామిక వేత్తల్లోని కొందరి అంచనా. గత మూడేళ్ల ట్రాక్ రికార్డ్ బట్టి.. అసలు ఇది కండక్ట్ చెయ్యటానికి ఎంత ఖర్చు అయ్యిందో .. కనీసం అంత పెట్టుబడులు (Investment) అయినా వస్తయ్యా అనే కాన్ఫిడెన్స్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ప్రభుత్వం చెప్పిన ప్రకారం 13 లక్షల కోట్ల పెట్టుబడుల (Investment) లెక్కలో పరికించి చూస్తే, NTPC – 2 లక్షల కోట్ల పెట్టుబడి & 77 వేల జాబ్స్ అని చెప్పారు.

అసలు NTPC మార్కెట్ కాపిటల్ 1.68 లక్షల కోట్లు ఇప్పటిదాక మొత్తం ఉధ్యోగులు 16 వేలు అటువంటి వీళ్లు 2 లక్షల కోట్లు పెడతారని 77 వేల కొత్త ఉధ్యోగాలు ఇస్తారని రాశారు . ABC లిమిటెడ్ – లక్షా ఇరవై వేల కోట్లని రాశారు . అసలు ABC సేల్స్ వుందే 150 కోట్లు .. ఇది లక్షన్నర కోట్లు పెట్టుద్దని చెప్పారు. IndoSolar – 123 కోట్ల మార్కెట్ కాపిటల్ వున్న ఇది 76 వేల కోట్లు పెట్టుబడి పెడతందని అని రాశారు. Renew Power – 9 వేల కోట్ల మార్కెట్ కాపిటల్ వున్న ఇది 97 వేల కోట్లు పెట్టుబడి పెడతందని అని రాశారు. Serentica – 1350 కోట్ల మార్కెట్ కాపిటల్ వున్న ఇది 13 వేల కోట్లు పెట్టుబడి పెడతందని అని రాశారు.

Avada Group – 243 కోట్ల మార్కెట్ కాపిటల్ వున్న ఇది 15 వేల కోట్లు పెట్టుబడి పెడతందని అని రాశారు.వైఎస్ రెడ్డి పార్టీ చలమలశెట్టి వారి కంపెనీ 47 వేల కోట్ల పెట్టుబడి అని రాశారు.ఇక చివరగా వన్ కన్ను అవినాష్ కి సంభందించిన షిరిడి ఎలక్ట్రికల్స్ 500 కోట్లు టర్నోవర్ వున్న ఇది 8855 కోట్లు పెట్టుబడి అని రాశారు మొత్తం 7 లక్షల కోట్ల లెక్క ఇది .. ఇంక మిగతావి కూడా ఇదే పరిస్థితి. 13 లక్షల కోట్లు అని ఎందుకు పెట్టారంటే కనీసం లక్ష కోట్లు అయినా అయ్యుంటయ్యిగా అని జనాలు అనుకోవాలని , అసలు విషయమేంటంటే ఇందులో నుండి 13 లక్షలు కాదు 13 వేల కోట్లు రావటం కూడా కష్టం. మన గత మూడేళ్ల ట్రాక్ రికార్డ్ బట్టి అర్థం అవుతుంది.

Also Read:  Cyber Criminals: ధోని , శిల్పాశెట్టి, ఇమ్రాన్ హష్మీల పాన్ కార్డు డీటెయిల్స్ తో క్రెడిట్ కార్డ్స్ పొందిన కేటుగాళ్లు