Site icon HashtagU Telugu

Vijayawada Floods : వామ్మో ..విజయవాడ లో లీటరు వాటర్ బాటిల్ రూ.100, పాలు రూ.150

Vjd Food&water

Vjd Food&water

విజయవాడ (Vijayawada )లో వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం (Food), పాలు (Milk), నీళ్లు (Water) అందిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్న ఆహారాన్ని కొందరు ఎక్కువ మోతాదులో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని, దీంతో అందరికి అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150కు అమ్ముతున్నారని బాధితులు వాపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి మొదలైన వర్షం శనివారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, విద్యాధరపురం ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. దీంతో కాలనీ వాసులు తాగేందుకు నీరు లేక..తినేందుకు తిండి లేక ఎవరైనా సాయం చేస్తారా అని ఎదుచూస్తున్నారు.

దీంతో ప్రభుత్వం సైతం కేంద్ర సాయం తీసుకోని వరద బాధితులను ఆదుకునేందుకు నడుం బిగించింది. స్వయంగా సీఎం చంద్రబాబే (CM Chandrababu) నడుం లోతు వరదలో నడుచుకుంటూ బాధితుల బాధలు చూసారు..తప్పకుండ ప్రభుత్వం సాయం చేస్తుందని భరోసా కల్పించారు. మూడో రోజూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం విస్తృతంగా పర్యటించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దాదాపు నాలుగున్నర గంటలు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్లు వెళ్లే అవకాశం లేని చోట కాన్వాయ్ ను పక్కన పెట్టి భవానీపురం నుండి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో దాదాపు 22 కిలోమీటర్లు జేసీబీపైనే సీఎం పర్యటన సాగించి.. ముంపులో ఉన్న బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితులకు భోజనం పాకెట్స్ , వాటర్ బాటిల్స్ , పాల పాకిట్స్ తో పాటు నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్న ఆహారాన్ని కొందరు ఎక్కువ మోతాదులో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని, దీంతో అందరికి అందడం లేదని ఆరోపిస్తున్నారు. లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150కు అమ్ముతున్నారని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి సారించింది.

Read Also : Floods in AP & TG : వరద బాధితులకు మహేష్ , పవన్ కళ్యాణ్ లు భారీ విరాళం

Exit mobile version